Jagan Praja Ashirvada Yatra : ప్రజాశీర్వాద యాత్ర చేపట్టబోతున్న సీఎం జగన్..?

గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేపట్టి అధికారం చేపట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్ (Jagan)..ఈసారి ప్రజాశీర్వాద యాత్ర (Praja Ashirvada Yatra) పేరుతో మరోసారి ప్రజల వద్దకు వెళ్లి మరోసారి అధికారం ఇవ్వాలని కోరబోతున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి జగన్..ప్రజల వద్దకు వెళ్ళలేదు. ఎలాంటి యాత్ర లు చేపట్టలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో మరోసారి ప్రజల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాలు కూడా పూర్తిగా […]

Published By: HashtagU Telugu Desk
Durgamata Mandapam Removed

Durgamata Mandapam Removed

గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేపట్టి అధికారం చేపట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్ (Jagan)..ఈసారి ప్రజాశీర్వాద యాత్ర (Praja Ashirvada Yatra) పేరుతో మరోసారి ప్రజల వద్దకు వెళ్లి మరోసారి అధికారం ఇవ్వాలని కోరబోతున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి జగన్..ప్రజల వద్దకు వెళ్ళలేదు. ఎలాంటి యాత్ర లు చేపట్టలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో మరోసారి ప్రజల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కావడం..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన (TDP -Janasena Alliance) కలిసి పోటీ చేయడం..మరోపక్క ప్రజల్లోనూ అధికార పార్టీ ఫై కాస్త వ్యతిరేకత ఉండడం ఇవన్నీ కూడా జగన్ ను ఆలోచనలో పడేశాయి. అలాగే సొంత పార్టీ నేతల తీరు ఫై కూడా ప్రజల్లో ఆగ్రహం ఉండడం తో..నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని చూస్తున్నాడు. ఇక చంద్రబాబు అవినీతి చేసి అరెస్ట్ అయ్యారని..ఇందులో రాజకీయ ప్రమేయం లేదని ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారు.

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను ప్రజలనే నమ్ముకున్నానని పలు సభల్లో సీఎం జగన్(CM YS Jagan) చెబుతూ వచ్చారు. తనకు ఎటువంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వై నాట్ 175 నినాదంతో ఎన్నికల సమరానికి సిద్ధం కాబోతున్నారు. ఇప్పటికే సర్వేల ద్వారా నియోజకవర్గాల వారీగా అభ్యర్దుల లెక్కలతో సిద్దమయ్యారు. జిల్లాల పర్యటన (Districts Tour)వేళ నేరుగా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు..కార్యాకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అక్కడి ప్రాంతీయ – సామాజిక సమీకరణాలు..ప్రత్యర్ది పార్టీల ఆశావాహులు…అక్కడి స్థానిక పరిస్థితులను పార్టీ నేతలతో చర్చించి..వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

Read Also : Brahmani Key Role in TDP : చైత‌న్య ర‌థం ఎక్క‌నున్న బ్ర‌హ్మణి? బ‌స్సు యాత్ర షురూ!!

  Last Updated: 25 Sep 2023, 02:03 PM IST