Jagan plan : మూడోసారి క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌,సీనియ‌ర్ల‌కు ఛాన్స్ ?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan plan) ఏదో అయింది.బిజీ షెడ్యూల్ పెట్టుకుని ఢిల్లీ వెళ్లారు.అంత‌కంటే

  • Written By:
  • Updated On - March 30, 2023 / 01:39 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan plan) ఏదో అయింది. రెండు రోజుల బిజీ షెడ్యూల్ పెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. అంత‌కంటే ముందు రెండుసార్లు ఏపీ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. సాధారణంగా అసెంబ్లీ స‌మావేశాల ముందు క‌లుస్తారు. మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ సంద‌ర్భంగా భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం ఉంటే రాజ్ భ‌వ‌న్ కు వెళ‌తారు. గ‌త రెండు వారాల్లో గ‌వ‌ర్న‌ర్ ను రెండుసార్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిశారు? అనే ప్ర‌శ్న వేసుకుంటే, వెంట‌నే వ‌చ్చే స‌మాధానం మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌.(Cabinet ReShuffle)

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan plan)

మూడోసారి మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ (Cabinet Reshuffle)ఉంటుంద‌ని రెండోసారి క్యాబినెట్ కూర్పు స‌మ‌యంలో సంకేతాలు ఇచ్చారు. అప్పుడు సీనియ‌ర్ల‌ను క్యాబినెట్ నుంచి తొలిగించారు. వాళ్ల‌లో ప్ర‌ధానంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ళ్లు, చెవులు మాదిరిగా ఉండే కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని, బాలినేని శ్రీనివాసుల రెడ్డి, పేర్ని నాని ఉన్నారు. ఆ ముగ్గురికీ మూడోసారి క్యాబినెట్ లో స్థానం వ‌స్తుంద‌ని విస్తృతంగా చ‌ర్చ జరుగుతోంది. రెండోసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వులు పొందిన రోజాతో పాటు గ్రాఫ్ ప‌డిపోయిన క‌నీసం 10 మందిని మార్చేస్తార‌ని తెలుస్తోంది.

రోజాతో పాటు గ్రాఫ్ ప‌డిపోయిన క‌నీసం 10 మందిని మార్చేస్తార‌ని

ఇటీవ‌ల జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక ఫ‌లితం చాలా కీల‌కం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను కలుపుతూ జ‌రిగిన ఎన్నిక అది. పైగా చ‌దువుకున్న వాళ్లు వేసిన ఓట్లు అవి. ఈవీఎంల‌కు బ‌దులుగా బ్యాలెట్ ద్వారా జ‌రిగిన ఎన్నిక‌. ప‌బ్లిక్ మూడ్ ఎలా ఉంది? అనేదానికి ఇంత కంటే అద్భుత స‌ర్వే ఉండ‌దు. దానికి తోడుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లోనూ వైసీపీకి ఘోర‌ప‌రావం ఎదుర‌యింది. ఈ ప‌రిణామాలు ఎటు చూసిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan plan) ప్ర‌తికూల‌మే. అందుకే, న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఆయ‌న దిగుతున్నార‌ని తెలుస్తోంది.

మంత్రుల ప‌నితీరు మీద ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే

రెబ‌ల్స్ మీద వేటు వేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan plan ) వాళ్ల స్థానాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయ‌గ‌లిగారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మిన‌హా మిగిలిన చోట్ల అంతా సెట్ చేశారు. అక్క‌డ కూడా రేపోమాపో ఇంచార్జిని ప్ర‌క‌టించ‌నున్నారు. అదే స‌మ‌యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాణించ‌లేని మంత్రుల జాబితా సిద్ధ‌మ‌యింది. వాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి తాడేప‌ల్లి కోట‌రీ అవ‌స‌రమైన స‌మాచారం సేక‌రించింద‌ట‌. మ‌రోమాట లేకుండా మంత్రివ‌ర్గం నుంచి వెళ్లిపోవ‌డానికి అంతా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. మంత్రుల ప‌నితీరు మీద ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే చేయిస్తున్నాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. గ్రాఫ్ బాగాలేని వాళ్ల‌కు సున్నితంగా మంద‌లింపు కూడా ముగిసింది. ఇక వాళ్ల‌పై వేటు వేయ‌డ‌మే మిగిలి ఉంది.

మంత్రివ‌ర్గం మూడోసారి ప్ర‌క్షాళ‌న

ఎన్నిక‌ల టీమ్ ను సిద్ధం చేసుకోవ‌డానికి (Cabinet Reshuffle)ప్ర‌య‌త్నిస్తోన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లో బిజీగా ఉండ‌డం మ‌రో కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. తెలంగాణ ఎన్నిక‌ల‌తో ముంద‌స్తుగా ఏపీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలంటే అసెంబ్లీని ర‌ద్దు చేయాలి. క్యాబినెట్ ను ర‌ద్దు చేస్తూ తీర్మానం చేయాలి. అలాంటి సంద‌ర్భం ఉంటే మంత్రివ‌ర్గం మూడోసారి విస్త‌ర‌ణ అంటూ ఉండ‌దు. ఏకంగా అసెంబ్లీ ర‌ద్దు మాత్ర‌మే ఉంటుంది. అప్పుడు అప‌ద్ధ‌ర్మ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan plan)కొన‌సాగుతారు. ఆయ‌న అనుకున్న విధంగా ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌డానికి లైజ‌నింగ్ న‌డుస్తుంద‌ని టాక్.

Also Read : Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

ఒక వేళ ముంద‌స్తు ముచ్చ‌లేక‌పోతే మాత్రం ఈ వార‌మే మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న(Cabinet Reshuffle) ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌క తాడేప‌ల్లి కోట‌రీ స‌ర్వం సిద్ధం చేసింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న క్యాబినెట్ లోని స‌గం మంది సామ‌ర్థ్యం అప్ టూ మార్క్ లేద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చింద‌ట‌. ప్ర‌త్యేకించి హోం మంత్రి తానేటి వ‌నిత‌, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి రోజా, మ‌రో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నితో పాటు రాయ‌సీమ‌లోని ఇద్ద‌రు పురుష మంత్రులు, గోదావ‌రి, ఉత్తరాంధ్ర‌లోని మ‌రో న‌లుగ‌రు పురుష మంత్రుల ప‌నితీరు బాగాలేద‌ని స‌ర్వేల సారాంశం. దాని ప్ర‌కారం మొత్తంగా 10 మందిని తొలగించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే, సీనియ‌ర్ల‌తో పాటు కొంద‌రు ఫ్రెష‌ర్ల‌కు కూడా మంత్రివ‌ర్గంలో స్థానం దొరుకుతుంద‌ని టాక్‌. ఢిల్లీ నుంచి విజ‌య‌వాడ చేరుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan plan) వేసే ప్ర‌తి స్టెప్ ఇప్పుడు టెన్ష‌న్ పుట్టిస్తోంది.

Also Read : Jagan Dinner : సాగ‌ర‌తీరాన`గాలా`,పెట్టుబ‌డులు ఎవ‌రికెరుక‌.!