Pithapuram : పవన్ కళ్యాణ్ అడ్డాలోకి జగన్..

Pithapuram : జగన్ రేపు నియోజకవర్గంలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్క పేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Jagan Pithapuram

Jagan Pithapuram

Jagan Pithapuram Tour on Sep 13 : మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ..రేపు జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అడ్డాలో అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు పిఠాపురం (Pithapuram ) నియోజవర్గంలో భారీ నష్టం ఏర్పడింది. పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో జగన్ రేపు నియోజకవర్గంలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్క పేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.

ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళతారు, అక్కడ బాధితులని పరామర్శిస్తారు. జగన్ పర్యటన నిమిత్తం వైసీపీ శ్రేణులు ఆయా ఏర్పాట్లు పూర్తి చేసారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం లో పర్యటించిన జగన్..ఫలితాల అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో వంగా గీత ఫై విజయం సాధించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం పర్యటించడం జరిగింది. ఇప్పుడు జగన్ పర్యటించబోతున్నారు. మరి రేపు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.

Read Also : రెండు గంటల నుండి బీఆర్ఎస్ నేతలను బస్సుల్లోనే తిప్పుతున్న పోలీసులు

  Last Updated: 12 Sep 2024, 10:48 PM IST