Jagan Order : ప‌వ‌న్, లోకేష్ అరెస్ట్ ల‌కు సీఐడీ గ్రౌండ్ ప్రిపేర్

Jagan Order :  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అరెస్ట్ చేసే ధైర్యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తారా? లోకేష్ ను అరెస్ట్ చేయ‌బోతున్నారా?

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 03:53 PM IST

Jagan Order :  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అరెస్ట్ చేసే ధైర్యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తారా? లోకేష్ ను అరెస్ట్ చేయ‌బోతున్నారా? చ‌ంద్ర‌బాబు జైలు నుంచి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారు? ఇవే ఏపీలోని ఏ ఇద్ద‌రు కలిసిన‌ప్ప‌టికీ మాట్లాడుకుంటోన్న మాట‌లు. ఎన్నిక‌ల వేళ ఇలాంటి చ‌ర్చ రావ‌డానికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ చ‌తుర‌త‌. నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధి ఏమీలేద‌ని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్న వేళ వాళ్ల ను జైలుకు పంపించ‌డం ద్వారా జ‌నం మూడ్ ను మార్చేశారు. గ‌త వారం రోజులు లోకేష్ అరెస్ట్ అంటూ టాక్ న‌డుస్తోంది. దాన్ని నిజం చేయ‌డానికి ఏపీ సీఐడీ ఢిల్లీ బాట ప‌ట్టింది. చ‌ట్టం ప్ర‌కారం 41ఏ నోటీసులు ఇవ్వ‌డానికి వెళ్లింది.

ఏపీ సీఐడీ ఢిల్లీ బాట (Jagan Order )

మాజీ సీఎం చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన త‌రువాత రెండు రోజులు మాత్ర‌మే లోకేష్ ఏపీలో ఉన్నారు. ఆ త‌రువాత ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియాలో స్కిల్ డ‌వ‌లెప్మెంట్ గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మీడియాముఖంగా ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం చాలా వ‌ర‌కు చంద్ర‌బాబు నిజాయితీని దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసింది. అందుకే, లోకేష్ మీద కేసులు పెట్ట‌డానికి సీఐడీ సిద్ద‌మైయింది. జైలుకు చంద్ర‌బాబును పంపిన త‌రువాత మీడియా ముందుకొచ్చిన సీఐడీ అధికారులు లోకేష్ ను కూడా త్వ‌ర‌లోనే అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతకంటే ముందే, వైసీపీ మాజీ మంత్రులు, మంత్రులు కొంద‌రు (Jagan Order) లోకేష్ అరెస్ట్ ను నిర్థారిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది.

శుక్ర‌వారం రాత్రికి లోకేష్ ను అరెస్ట్ చేయాల‌ని పోలీస్ వర్గాల్లోని టాక్‌

ముంద‌స్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. స్కిల్ కేసులో మాత్ర‌మే ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. అక్టోబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి లేద‌ని కోర్టు చెప్పింది. కానీ, 41ఏ నోటీసుల ప్ర‌కారం విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని తెలిపింది. అయితే, ఫైబ‌ర్ నెట్, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. స్కిల్ కేసులో కోర్టు ఆదేశం మేర‌కు అరెస్ట్ చేయ‌న‌ప్ప‌టికీ మిగిలిన రెండు కేసుల్లో లోకేష్ ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. యువ‌గ‌ళం ప్రోగ్రామ్ ను తాత్కాలికంగా ఆపేసిన ఆయ‌న ఢిల్లీలోనే రెండు వారాలుగా ఉంటున్నారు. ఆయ‌న్ను ప‌ట్టుకురావ‌డానికి ఏపీ సీఐడీ ఢిల్లీ వెళ్లింది. సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి ఆదేశాల (Jagan Order) మేర‌కు శుక్ర‌వారం రాత్రికి లోకేష్ ను అరెస్ట్ చేయాల‌ని పోలీస్ వర్గాల్లోని టాక్‌. అదే టీడీపీలోనూ వినిపిస్తోంది.

Also Read : CBN Jail Effect In Telangana : చంద్ర‌బాబు జైలుపై ఒకే పంథాలో రేవంత్ , కేటీఆర్

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఇస్తోన్న లీకులు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యం భూమి త‌క్కువ ధ‌ర‌కు అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఇప్పించార‌ని ఆరోప‌ణ‌. అంతేకాదు, రింగ్ రోడ్డు దాని మీదుగా వెళ్ల‌కుండా మ‌ళ్లించార‌ని చెబుతున్నారు. అందుకే, చంద్ర‌బాబుతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా అరెస్ట్ చేస్తార‌ని టాక్. ఆయ‌న అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి వారాహి యాత్ర మూడో విడ‌త‌కు వెళుతున్నారు. ఆ లోపుగా ఆయ‌న‌కు కూడా 41ఏ నోటీసులు ఇస్తార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత అవ‌ర‌స‌మైతే, అరెస్ట్ చేయాల‌ని సీఐడీ భావిస్తోంద‌ని (Jagan Order) వైసీపీ వ‌ర్గాల్లోని వినికిడి.

Also Read : Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం

ఇప్ప‌టికే మాజీ మంత్రుల్ని కొంద‌రిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద కూడా గురిపెట్టింది. అంతేకాదు, హెరిటేజ్ కు అమ‌రావ‌తిలో భూములు ఇవ్వ‌డం, రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో ఏదో జ‌రింద‌ని అభియోగం మోప‌డం ద్వారా కేసుల విచార‌ణ‌కు భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మిణి వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శి కేసులో రామోజీరావును విచారించిన సీఐడీ అరెస్ట్ ల దాకా వెళ్లింది. ఆ కంపెనీ ఎండీ శైల‌జ అమెరికా వెళ్లే వ‌ర‌కు ఎందుకు ఉన్నారంటూ సీఐడీ అధికారుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిల‌దీశార‌ట‌. అందుకే, ఇప్పుడు ఆయ‌న ఎవ‌ర్ని చెబితే వాళ్ల‌ను వెంట‌నే అరెస్ట్ చేయ‌డానికి సీఐడీలోని కొంద‌రు అధికారులు దూకుడుగా వెళుతున్నార‌ని పోలీసు వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఆ కోవ‌లోకి ప‌వ‌న్ అరెస్ట్ కూడ రావ‌చ్చ‌ని తెలుస్తోంది.