Jagan Once more :`మ‌రో ఛాన్స్`దిశ‌గా జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో ఛాన్స్ (Jagan Once more) కోసం ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం ప్ర‌త్య‌ర్థుల‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది.

  • Written By:
  • Updated On - June 13, 2023 / 01:29 PM IST

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంగా సేఫ్ జోన్లోకి వ‌చ్చేస్తున్నారు. మ‌రో ఛాన్స్ (Jagan Once more) కోసం ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం ప్ర‌త్య‌ర్థుల‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. క్రిస్టియ‌న్, ముస్లిం మైనార్టీ ఓట్ల‌ను భ‌ద్రంగా ఉంచుకోవ‌డానికి వేసిన ఎత్తుగ‌డ సామాన్యుల‌కు అంతుబ‌ట్ట‌కుండా ఉంది. రాజ‌కీయంగా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌ను కార్న‌ర్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బీజేపీ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు కేంద్రంగా ఒక అడుగు వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అండలేక‌పోయినా దేవుని ద‌య‌, ప్ర‌జల ఆశీస్సులు ఉంటే చాల‌ని గొంతెత్తారు. అంటే, బీజేపీ (BJP)తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయ‌న్న భావ‌న క‌లిగించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొలిటిక‌ల్ స‌ర్క‌స్ మొద‌లు పెట్టారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొలిటిక‌ల్ స‌ర్క‌స్ మొద‌లు (Jagan Once more)

ప్ర‌స్తుతం బీజేపీ మీద ముస్లిం మైనార్టీలు, క్రిస్టియ‌న్లు పూర్తి స్థాయి వ్య‌తికంగా ఉన్నార‌ని క‌ర్ణాట‌క ఫ‌లితాల ద్వారా అర్థ‌మ‌వుతోంది. బీజేపీతో అంట‌కాగినా, ఆ పార్టీ మ‌ద్ధ‌తు తీసుకున్న‌ప్ప‌టికీ మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. అందుకే, క‌మ‌ల‌నాథుల‌కు దూరంగా ఉన్నామ‌న్న భావ‌న క‌లిగించ‌డానికి నానా తంటాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Once more) ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు ముస్లిం, క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు. ఆ ఓట్లు చెదిరిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అలాగ‌ని, నేరుగా బీజేపీ తో వార్ ప్ర‌క‌టిస్తే ఏమ‌వుతుందో ఆయ‌న‌కు తెలుసు. అందుకే, ప‌ల్నాడు వేదిక‌గా బీజేపీ అండ ఉండ‌క‌పోయిన‌ప్ప‌టికీ గెలుపు మ‌న‌దేనంటూ బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌ను ఆక‌ర్షించడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ముస్లిం, క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా జాగ్ర‌త్త

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయ‌కుడు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు అమిత్ షా, న‌డ్డాల‌తో భేటీ అయ్యారు. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఆయ‌న వెళ్లారని స‌ర్వ‌త్రా వినిపించింది. అంతేకాదు, ఎన్డీయేలో భాగ‌స్వామి కావ‌డానికి కూడా సిద్ద‌ప‌డ్డార‌ని టాక్ న‌డిచింది. స‌రిగ్గా ఇదే స‌మ‌య‌మ‌ని గ్ర‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీజేపీకి వ్య‌తిరేక స్వ‌రాన్ని వినిపించారు. అంటే, బీజేపీ భుజం మీద మైనార్టీ వ్య‌తిరేక తుపాకీని పెట్టి చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాన్ని పేల్చేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Once more) మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌న్న‌మాట‌. అందుకే స‌హ‌జ మిత్రులుగా ఉన్న వైసీపీ, బీజేపీ గేమ్ ను ర‌క్తిక‌ట్టించాయి.

బీజేపీ భుజం మీద మైనార్టీ వ్య‌తిరేక తుపాకీని పెట్టి చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాన్ని పేల్చేయాల‌ని

రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షా, న‌డ్డా ఇద్ద‌రూ ఒకేసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అవినీతి మీద విరుచుకుప‌డ్డారు. అయితే, ఎక్క‌డా ఆధారాల‌ను చూపుతూ మాట్లాడ‌లేదు. య‌థాలాపంగా రాజ‌కీయ‌ప‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేసి వెళ్లారు. అందుకు ప్ర‌తిగా వైసీపీ లీడ‌ర్ల‌కు కూడా మీడియా ముందుకొచ్చారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు ఉన్న టీడీపీ, బీజేపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. అప్పుడు టీడీపీ, బీజేపీ రాష్ట్రానికి ఏమి చేశాయ‌ని మాట్లాడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, ఎక్క‌డా తొమ్మిదేళ్ల న‌రేంద్ర మోడీ పాల‌న గురించి ప‌ల్లెత్తు మాట అన‌డానికి వైసీపీ సాహ‌సం చేయ‌లేదు.

Also Read : Jagan Governament : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ విజ‌యం!ఒకే ఒక్క‌డు సూర్య‌నారాయ‌ణ!!

అలాగే, రాజ‌ధాని లేని రాష్ట్రం అంటూ బీజేపీ అగ్ర‌నేత‌లు షా, న‌డ్డా ఇప్ప‌టి వ‌ర‌కు వింటూ ఉన్న రాజ‌కీయ ఆరోప‌ణ‌ను చేశారు. కానీ, ఎక్క‌డా ఆధారాల‌తో స‌హా అవినీతినిగానీ, రాజ‌ధాని అంశాన్నిగానీ క‌మ‌ల‌నాథులు లేవ‌నెత్త‌లేదు. అంటే, బీజేపీ, వైసీపీ విధానప‌ర‌మైన అంశాల‌పై ఎక్క‌డా విమ‌ర్శించుకోవ‌డం లేదు. సాధార‌ణంగా వినిపించే రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌తో ర‌క్తిక‌ట్టించార‌న్న‌మాట‌. ఇదంతా గ‌మ‌నిస్తే, ముస్లిం, క్రిస్టియ‌న్ ఓట్లు చెదిరిపోకుండా వైసీపీ అడుతోన్న గేమ్ కు బీజేపీ స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు ఉంది. అంతిమంగా ఆ రెండు పార్టీల టార్గెట్ మాత్రం చంద్ర‌బాబు. ఆయ‌న పార్టీ టీడీపీ. ఆ ల‌క్ష్యాన్ని చేర‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్లామ‌ర్ ను ఒక పావుగా బీజేపీ వాడుకుంటోంది. ఫ‌లితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో ఛాన్స్ (Jagan Once more) దిశ‌గా వేస్తోన్న అడుగులు వేగం పుంజుకున్నాయ‌న్న‌మాట‌.

Also Read : Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌