Jagan New Look : సరికొత్త లుక్ లో జగన్..వావ్ అంటున్న వైసీపీ శ్రేణులు

బెంగళూరులోని తన నివాసంలో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 11:35 AM IST

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సరికొత్త లుక్ (New Look) లో కనిపించి వావ్ అనిపించాడు. బెంగళూరులోని తన నివాసంలో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ ఫైజామా, బ్లాక్ ప్యాంట్తో జగన్ కనిపించారు. గతంలో ఈ తరహా లుక్లో జగన్ను ఎప్పుడూ చూడలేదని YCP శ్రేణులు అంటున్నాయి. ఈ లుక్ లో జగన్ సరికొత్త స్టయిల్ లో ఉన్నాడని వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ లుక్ వెనుక కారణం ఏంటో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల్లో 175 కి 175 కొడతాం అంటూ చెప్పుకొచ్చిన జగన్..ప్రజలు ఇచ్చిన షాక్ తో హిమాలయాలకు సైతం వెళ్లాలని అనుకున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా జగనే చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత గత వారం పార్టీ నేతలతో జగన్ సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగుచూశాయి. తాను అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందని అన్నారట. కానీ మరి ఎందుకు వెళ్లలేదో తెలుసా?. దానికి కూడా జగన్ సమాధానం చెప్పారట. నిజంగానే హిమాలయాలకు వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌ నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో ప్రజలు మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాలి అనిపించింది. దాంతోనే మెల్లగా ఎన్నికల ఫలితాల నుంచి బయటికొచ్చాను.

ఆ రిజల్ట్స్ ఎందుకు అలా వచ్చాయి అనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన ప్రజల కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాము, వాటిలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. అందువల్లనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను ఆ పరిస్థితి నుంచి బయటికి వచ్చినట్లే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం అవ్వండి’ అని నేతలతో మాజీ సీఎం జగన్ చెప్పారు.

Read Also : Honda Activa: హోండా యాక్టివాలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న స్కూట‌ర్ ఇదే.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఇవే..!