Site icon HashtagU Telugu

Varikapudisela Project : రేపు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన

Jagan Delhi

Jagan Delhi

రేపు (బుధువారం) సీఎం జగన్ (CM Jagan) పల్నాడు జిల్లా మాచర్ల (Macherla)లో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టు (Varikapudisela Irrigation Project)కు సీఎం జగన్ శంకుస్ధాపన (Lay Foundation Stone) చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆయన పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేసారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు జగన్‌ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా మాచర్లకు చేరుకొని… అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్ధలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

సభలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించనున్నారు. మరోవైపు విపక్షాలపై కూడా విరుచుకుపడనున్నారు. ఇక ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక ఈ వరికపూడిశెల ప్రాజెక్టు.. పల్నాడు జిల్లాని సస్యశ్యామలంగా మార్చే కలల ప్రాజెక్టు. ఇప్పటికే దీనికి గతంలో రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. సాగునీరు అందని పల్నాడు ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు.. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి సాగర్‌ కుడికాలువ కింద సాగునీరు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. తమకు సాగునీరు అందించాలని దశాబ్దాలుగా రైతులు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వరికపూడిశెలకు జగన్ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో..సాగునీరు ఎప్పుడు అందుతుందో చూడాలి.

Read Also : Telangana: ఎమ్మెల్యే అభ్యర్థులకు షాక్, 608 మంది నామినేషన్లు తిరస్కరణ!