TDP vs YSRCP: అచ్చెన్న పై జ‌గ‌న్ సీరియ‌స్.. అస‌లు కార‌ణం అదేనా..?

  • Written By:
  • Updated On - March 7, 2022 / 03:10 PM IST

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎంప జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈరోజు ఏపీలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగాన్ని ప్రారంభించ‌గానే, టీడీపీ నేత‌లు గో.. బ్యాక్ గ‌వ‌ర్నర్ అంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ, గ‌వ‌ర్నర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసి, చివ‌రికి స‌భ నుంచి టీడీపీ నేత‌లు వాకౌట్ అయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్‌ను అవ‌మానించార‌ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పై జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఈ క్ర‌మంలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని జ‌గన్ తప్పుబట్టారు. గ‌తంలో ఎన్న‌డూ ఇలా జరగలేదని, గవర్నర్ ఎవరి పార్టీ కాదని, ఎందుకు ప్రసంగాన్ని అడ్డుకున్నారని టీడీపీ నేత‌ల‌పై జగన్ మండిప‌డ్డారు. అంత పెద్ద వయసున్న వారిని అవమానించడం తగదని జ‌గ‌న్ చెప్పారు.

ఇక ఈరోజు నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో, తొలిరుజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే సభలో ఆయన ప్రసంగం మొదల‌వ‌గానే, టీడీపీ నేత‌లు క్కసారిగా వెల్ లోకి దూసుకొచ్చి గవర్నర్ ప్రతులను చింపి విసిరేశారు. అయినా టీడీపీ స‌భ్యుల‌ ఆందోళన ఎంతకు సద్దుమణగకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. దీంతో మార్ష‌ల్స్ ఎంట్రీ ఇవ్వ‌డంతో, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. మ‌రోవైపు ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతనలో బీఏసీ సమావేశం జరిగింది.

ఇక ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనీల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. ఈ క్ర‌మంలో మార్చి 25 వ‌ర‌కు అంటే 13 రోజుల‌పాటు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. 13 రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 20 కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంద‌ని స‌మాచారంఇక రెండో రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి స‌భ‌లో సంతాపం తెలియజేసి రేప‌టి అసెంబ్లీ సెష‌న్‌కు వాయిదా వేస్తారు. ఇక‌పోతే 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.