Jagan Dictatorship: డిక్టేటర్ షిప్ లో డొల్లతనం

వైసీపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. అలా ఇలా కాదు భారీ షాకులే వచ్చి పడుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారో కానీ వైసీపీ పని అయిపోయింది

  • Written By:
  • Updated On - March 25, 2023 / 10:08 AM IST

Jagan Mohan Reddy : వైసీపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. అలా ఇలా కాదు భారీ షాకులే వచ్చి పడుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారో కానీ వైసీపీ పని అయిపోయింది అన్న మాటను ఇపుడు అచ్చం అలాగే జరుగుతోందా అంటే చర్చ మాత్రం ఆ దిశగానే సాగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం వ్యూహాలలో దిట్ట. వైసీపీ ఆ విషయంలో వెరీ పూర్. అది మరోసారి రుజువు అయింది.

వైసీపీ ఈ రకంగా ఓటములతో కునారిల్లడానికి కారణం వారూ వీరూ కాదు లేదా క్రాస్ ఓటింగ్ చేసి పార్టీని ఓడించిన వారు అంతకంటే కాదు అసలు కారణం పార్టీ అధినాయకత్వమే అని అంటున్నారు. అధినాయకత్వం తీరుతోనే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే అధినాయకత్వానికి ఖాతరు లేదని లెక్క అసలే లేదని వైసీపీలో ఘాటైన చర్చ సాగుతోంది.

అలాగే రెండు లక్షల మంది ప్రజనీకం ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేకు అధినాయకత్వం వద్ద కనీసం అపాయింట్మెంట్ ఉండదు వారు గోడు ఎవరూ కనీసం పట్టించుకోరు. ఇక వారిని కేవలం ఉత్సవ విగ్రహాలు మాదిరిగా చేసి పారేసారు అన్న విమర్శలు ఎటూ ఉన్నాయి. అంతా సచివాలయాలు వాలంటీర్లతోనే కధ నడిపిస్తూ ఎమ్మెల్యేలను కేవలం రబ్బర్ స్టాంపుల మాదిరిగా చేయడం వల్లనే వారిలో పేరుకుపోయిన అసహనం పార్టీ కొంపను సరైన టైం లో ముంచుతోంది అని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యే అంటే ఒకనాడు అధికార దర్జాతో ఉండేవారు. తమ వద్దకు ఎవరైనా పనుల కోసం వస్తే చేసి పెట్టేవారు. నియోజకవర్గానికి మొత్తం కింగ్ లా ఉండేవారు. అలాంటి ఎమ్మెల్యేల చేతిలో ఇపుడు అధికారం లేదు నిధులు కూడా లేవు. డెవలప్మెంట్స్ నిధులు కావాలీ అన్నా ఇచ్చే నాధుడు లేడు. ఏదైనా పని కోసం అధినాయకత్వం దగ్గరకు ఎవరైనా నాయకుడు వెళ్లినా ఎమ్మెల్యే వెళ్ళినా వారికి క్లాస్ పీకుడు తప్ప మరేమీ ఉండదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:  CM Jagan: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

ఎమ్మెల్యేలు అయినా ఎంతటి వారు అయినా వచ్చి దండం పెట్టి వెళ్లిపోవాలంతే అన్న తీరున పరిస్థితి ఉంది అని అంటున్నారు. అధినాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య దూరం భూమీ ఆకాశం అన్నంతగా పెరిగిపోయింది. ఈ అతి పెద్ద గ్యాప్ తోనే ఎమ్మెల్యేలు ఎంతో మధన పడుతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక ఎమ్మెల్యే స్థాయి ఇంతలా పడిపోవడం ఎక్కడా చూడలేదని పాత తరం నాయకులు అనుకునే పరిస్థితి ఉంది.

ఇక అధినాయకత్వం వద్దకు వెళ్తే ఒక బొకె ఇచ్చిన వారికి దండం పెట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోయే స్థితిలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వారి సాధక బాధకాలు ఎవరికీ పట్టరు ఎవరూ అడగరు. పైగా ఇదేమిటి మీ గ్రాఫ్ పడిపోయింది అంటూ వారికే క్లాస్ తీసుకుంటారు. అందువల్లనే ఎమ్మెల్యేలలో నిర్లిప్తత చాలానే ఉంది అంటున్నారు.

Also Read:  Jagan Rule : మ‌తోత్సాహం, ద‌ళిత క్రిస్టియ‌న్లు ఇక ఎస్సీలు!

ఇలా ఎమ్మెల్యేలను తమ పార్టీ నిలబెట్టి గెలిపించిన వారిని ఏమీ కాకుండా చేసి జనంలో ఉంచితే వారు ఓడిపోక వాడిపోక ఎలా గెలుస్తారు. అంటే ఎమ్మెల్యేలు ఓడిపోతే పార్టీ ఓడినట్లు కదా. అధినాయకత్వం వద్ద ప్లాన్ బీ అని ఒకటి ఉండవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారిని పెట్టుకుందామని అయినా సరే అయిదేళ్ళు పాత వారు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎంతో కొంత వారికి బలం ఉంటుంది కదా అపుడు ఆ బలం అటూ ఇటూ పంచుకుంటే అపుడు వైసీపీ కచ్చితంగా ఓడిపోక ఏమి జరుగుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏది ఏమైనా మొత్తం వైసీపీ ఇలా మారడానికి కారణం అధినాయకత్వం పోకడలే అని అంటున్నారు. అధినాయకత్వం ఎమ్మెల్యేలతో సవ్యంగా సాఫీగా ఉంటూ వారిని దగ్గరకు రానిచ్చి సావధానంగా వారి సమస్యలు విని పరిష్కారం చేసిన నాడు వారు కూడా విధేయతతో ఉంటారని అంటునారు. కానీ అలాంటి యాక్సెసిబిలిటీ లేని నాడు ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారు. ఇది అంతం కాదు ఆరంభం మత్రమే అని అంటున్నరు జస్ట్ ఇది తొలి హెచ్చరిక అని కూడా చెబుతున్నారు. మరి చూడాలి దీనిని గమనంలోకి తీసుకుని సరైన రిపేర్లు పార్టీ చేస్తుందా లేక ఇదే తీరున సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Also Read:  Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు