Site icon HashtagU Telugu

Jagan Memantha Siddham : మనం చేసిన మంచి దారిపొడవునా కనిపిస్తుంది – జగన్

Jagan Tweet

Jagan Tweet

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర (Memantha Siddham Bus yatra) సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతుండడం తో వైసీపీ నేతల్లో గెలుపు ఫై మరింత డిమా పెరుగుతుంది. ఈరోజు మూడోరోజు యాత్ర కర్నూల్ (Kurnool) జిల్లాలో కొనసాగుతుంది. శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభం అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

పెంచిక‌ల‌పాడు శిబిరం వ‌ద్దకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ సీఎం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించారు. సీఎం వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం‌ఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. కోరుమూరులో జ‌గ‌న్‌కు పూల‌వ‌ర్షంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. జై జ‌గ‌న్ అంటూ నిన‌దిస్తూ యాత్ర‌లో పాల్గొన్నారు. దారిపొడవునా బారులు తీరిన జ‌నానికి బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తూ సీఎం జగన్ యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఓ వృద్ధురాలు జగన్ కోసం రావడం చూసి జగన్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఆ వృద్ధురాలిని కౌగిలించుకుని ముద్దుపెట్టారు. ‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. వారి సంక్షేమం కోసం పెన్షన్ను రూ.3 వేలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడవునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తోంది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Read Also : Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144సెక్షన్ అమలు