Site icon HashtagU Telugu

CM Jagan: మోడీతో జగన్ భేటీ ఎజెండా ఇదే

Pmo Imresizer

Pmo Imresizer

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల కవరేజీలో హేతుబద్ధత, బకాయిలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఇంటరాక్షన్ సందర్భంగా, ఫిబ్రవరి 11, 2019న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ₹55,548.87 కోట్ల సవరించిన వ్యయ అంచనాలను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రధానిని అభ్యర్థించారు. నిర్మాణం కోసం ₹8,590 కోట్లు మరియు పునరావాసం కోసం ₹22,598 కోట్లు అయిందని వివరించారు.బిల్లులను కాంపోనెంట్‌ల వారీగా కాకుండా పూర్తిగా క్లియర్ చేయవలసిందిగా ప్రధానమంత్రిని అభ్యర్థించారు
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 16 చోట్ల బీచ్ శాండ్ మినరల్స్ కేటాయించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో మరో 12 బోధనాసుపత్రుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ప్రధానిని కోరారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ₹32,625.25 కోట్లను పెండింగ్ బిల్లుల రూపంలో ఖర్చు చేసిందని, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా రెవెన్యూ లోటును పూడ్చాలని ప్రధానిని కోరారు.
విభజన మరియు COIVD మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయిందని, రాష్ట్ర రుణ పరిమితిని సడలించాలని ప్రధానిని కోరారు. తెలంగాణ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ మరియు తెలంగాణ డిస్కమ్‌ల నుండి ఆంధ్ర ప్రదేశ్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APGENCO) ద్వారా ₹ 6,455.76 కోట్లు రావాల్సి ఉందని, ఈ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రధానిని అభ్యర్థించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన జగన్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.