AP : ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన జగన్

బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Jagan Ipac

Jagan Ipac

ఏపీ లో మే 13 న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ (AP Election Polling) జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం (Polling Percentage) పెరగడం తో ఓటర్లు ఎవరికీ సపోర్ట్ చేశారనేది అందరిలో ఆసక్తి గా మారింది. పోలింగ్ శాతం పెరగడం మాకు అనుకూలంగా ఉండబోతుందంటూ వైసీపీ ఇటు కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కూటమి నేతల్లో గెలుపు ధీమా ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో పలువురు వైసీపీ నేతల మాటలు వారిలో ఓటమి స్పష్టంగా కనిపిస్తుందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ తొలిసారి ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ (CM Jagan) భేటీ అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ (IPAC Team) కార్యాలయానికి వెళ్లిన జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని పేర్కొన్నారు. ఇక జగన్ మాటలతో వైసీపీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం పెరుగుతుంది. నిన్నటి వరకు ఎన్నికల పోలింగ్ ఫై కానీ ఫలితాలపై కానీ జగన్ మాట్లాడకపోవడం..ఇదే క్రమంలో కూటమి నేతలు గెలుపు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టడంతో వైసీపీ శ్రేణులు కాస్త నిరాశలో ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ మాటలతో వారిలో జోష్ పెరిగింది. మరి ఫలితాల్లో ఏంజరగబోతుందో చూడాలి.

Read Also : Surya Karthik Subbaraju : సూర్య సినిమాకు దసరా కంపోజర్.. కార్తీక్ సుబ్బరాజు సూపర్ ప్లానింగ్..!

  Last Updated: 16 May 2024, 03:24 PM IST