Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?

జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 02:18 PM IST

గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయకేతనం ఎగరవేసిన జగన్ (Jagan)..ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోకతప్పదని సర్వేలు చెపుతున్నాయి. బయటకు 175 కి 175 కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం 75 అయినా కొట్టగలమా..అని నేతలు మాట్లాడుకుంటున్న సందర్భం లేకపోలేదు. గత ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy Son) కొడుకు కు ఒక్క ఛాన్స్ ఇద్దామని ప్రజలంతా ఏకమై ఓటు వేశారు. కానీ ఇప్పుడు ఆలా కాదు జగన్ కు ఎందుకు వేసామో అని అనుకుంటున్నా వారు కూడా ఉన్నారు. మరోపక్క ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ , జనసేన , బిజెపి (TDP Janasena BJP Alliance) లు ఏకమయ్యాయి. వీరి పొత్తులపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ..లోలోపల మాత్రం వీరి పొత్తు ఓకే అయ్యింది.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతూ ప్రజల్లో మార్పు తెస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మాస్టర్ ప్లాన్ (Jagan Master Plan) చేసినట్లు తెలుస్తుంది. రాజకీయాలకు కంచుకోటగా అని పిలువబడే విజయవాడ ఎంపీ స్థానానికి (YCP Vijayawada MP Seat) ఓ ఎస్సీ అభ్యర్థి (SC Candidate) ని నిలబెట్టాలని జగన్ చూస్తున్నాడట. ఇప్పటికే ఆ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం. విజయవాడ (Vijayawada ) అంటే చాలా డిమాండ్ ఉన్న సీటు. రాజకీయాల్లో అరుతేరిన పెద్ద పెద్ద వ్యక్తులెందరో అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం సీఎం వద్ద క్యూ కడుతుంటారు. అలాంటి డిమాండ్ ఉన్న సీటుకు ఓ ఎస్సీ అభ్యర్థి ని నిలబెట్టాలని జగన్ చూస్తుండడం తో ఓ సంచలనమే అని చెప్పాలి.

Read Also : CBN Happy : చంద్ర‌బాబుకు మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ జోష్

మాములుగా విజయవాడ లో ఎక్కువగా కమ్మ కులం (Kamma Caste) వారే ఉంటారు. దాదాపు 40 ఏళ్లుగా విజయవాడ స్థానంలో కమ్మ కులస్తులే నిలుస్తూ..గెలుపొందుతూ వస్తున్నారు. కాంగ్రెస్ , టీడీపీ , జనసేన , బీజేపీ ఇలా ఎన్నిపార్టీలు ఇక్కడ పోటీ చేసిన వారంతా కూడా కమ్మ వారినే నిల్చుబెడుతూ వస్తున్నారు. అందుకే విజయవాడ ఎంపీ సీటు అనే అది కమ్మ సీటు అని అంత మాట్లాడుకుంటుంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన పశ్చిమ కృష్ణలో కమ్మ, బందరుతో కూడిన తూర్పు కృష్ణలో కాపు జనాభా, రాజకీయ ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి ఈసీట్లను ఆ కులాలకే కేటాయిస్తూ వస్తున్నారు. బందరులో మార్పులు జరిగాయి కానీ.. విజయవాడ మాత్రం 40ఏళ్లుగా అదే కొనసాగుతోంది. అలాంటి ఆనవాయితీకి జగన్ బ్రేక్ వేయబోతున్నట్లు తెలుస్తుంది.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ కులం ఈ సారి జగన్ వెంట నిలువడం కష్టమే అని సర్వేలు చెపుతున్నాయి. టీడీపీ- వైసీపీ (TDP-YCP) ఇద్దరు కమ్మ అభ్యర్థులనే పెడితే కచ్చితంగా ప్రజలు టీడీపీకే ఓటు వేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఒక ఎస్సీని నిలబెడితే… ఒక జనరల్ స్థానంలో రిజర్వ్డుడ్ అభ్యర్థిని నిలబెట్టిన క్రెడిట్ వైసీపీకి వస్తుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ జనాభా ఎక్కువ. నందిగామ, తిరువూరు రిజర్వుడ్ సీట్లు రెండు ఉన్నాయి. జగ్గయ్యపేటలో కూడా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో విజయవాడ నగరంలో ఎస్సీ జనాభా చాలా ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. దీంతో విజయవాడ లో ఓ ఎస్సి అభ్యర్థిని నిలబెడితే వారికే ఓటు వేస్తారని..ఒక జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఓ ఎస్సి అభ్యర్థి కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరి జగన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.