Site icon HashtagU Telugu

Jagan manifesto : ఫోన్‌, టీవీ రీచార్జి ఫ్రీ మేనిఫెస్టో? జ‌గ‌న్ కు రిల‌యెన్స్ స‌హ‌కారం!

Jagan Manifesto

Jagan Manifest

న‌వ‌ర‌త్నాల‌ను మించిన ఆఫ‌ర్ల‌ను (Jagan manifesto) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇచ్చే ఆఫ‌ర్ల‌కు రిల‌యెన్స్ జియో స‌హ‌కారం అందిస్తోంద‌ని స‌మాచారం. ఒకేసారి వంద రిల‌యెన్స్ జియో ట‌వ‌ర్ల‌ను ఏపీ సీఎం ప్రారంభించారు. వాటి ద్వారా సాంకేతిక ఆఫ‌ర్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌బోతున్నారు. ప్ర‌జా నాడిని ప‌ట్టేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దానికి అనుగుణంగా మేనిఫెస్టో ను రూపొందిస్తున్నారు. సాంకేతిక రూపంలో అందించే సేవ‌ల్ని ఎన్నిక‌ల ఆఫ‌ర్లుగా ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

న‌వ‌ర‌త్నాల‌ను మించిన ఆఫ‌ర్ల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధం(Jagan manifesto) 

లండ‌న్ త‌ర‌హా వైద్యంపై ఏపీ స‌ర్కార్ దృష్టి పెట్టింది. అందుకు త‌గిన విధంగా నిధులు, నియామ‌కాలు చేస్తోంది. వాటిని సాంకేతిక‌కు అనుసంధానం చేస్తోంది. అందుకోసం గురువారం ఒకేసారి 100 ట‌వ‌ర్ల‌ను రిల‌యెన్స్ జియో ప్రారంభించింది. ఇక జియో 4జీ సేవ‌లు మారుమూల గ్రామాల‌కు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఫైబ‌ర్ నెట్ విస్త‌ర‌ణ వేగంగా జ‌రుగుతోంది. టీవీ ఛానల్స్, ఫోన్ త‌దిత‌ర సేవ‌ల్ని ఉచితంగా ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం (Jagana manifesto) చేస్తున్నారు. రిల‌యెన్స్ జియో ద్వారా ఉచితంగా సేవ‌ల్ని అందించ‌డానికి ఒప్పందాల‌ను కుదుర్చుకుంటున్నార‌ని తెలుస్తోంది. వాటికి అనుగుణంగా మేనిఫెస్టో త‌యారుకు క‌స‌ర‌త్తు జ‌రుగుతోందని వినికిడి.

రిల‌యెన్స్ జియో ద్వారా ఉచితంగా సేవ‌ల్ని అందించ‌డానికి

మ‌హానాడు సంద‌ర్భంగా చంద్ర‌బాబు టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. దాన్ని విస్తృతంగా టీడీపీ క్యాడ‌ర్ ప్ర‌చారం చేస్తోంది. మ‌హిళ‌లు, యువ‌త‌, రైతు, బీసీల‌ను ఆక‌ట్టుకునేలా ఉచిత స్కీమ్ ల‌ను ప్ర‌క‌టించారు. అవ‌న్నీ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఇచ్చిన హామీలంటూ వైసీపీ విమ‌ర్శ‌ల‌కు దిగింది. ఇత‌ర పార్టీల నుంచి కాపీ కొట్టిన హామీలంటూ వైసీపీ నేత‌లు కొట్టిపారేశారు. దానికి భిన్నంగా మేనిఫెస్టో ఉంటుంద‌ని ఫ్యాన్ పార్టీ చెబుతోంది. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పేద‌ల్ని ఆక‌ర్షించే తాయిలాల‌పై (Jagan manifesto) అధ్య‌య‌నం చేస్తోంది. వాటిలో సాంకేతిక అనుసంధానంగా ఉండే వాటిని అన్వేషించింది.

ఫైబ‌ర్ నెట్ ద్వారా టీవీల‌ను ఉచితంగా చూసేలా మేనిఫెస్టో

మ‌నిషికో సెల్ ఫోన్ ప్ర‌స్తుతం ఉంది. నిరుపేద‌లు కూడా ఫోన్లు వాడుతున్నారు. ఇంకా మొబైల్ ఫోన్లు లేని పేద‌ల‌ను గుర్తించ‌డం ద్వారా జియో ఫోన్ల‌ను ఉచితంగా ఇవ్వాల‌ని వైసీపీ మేనిఫెస్టోలో ఒక అంశంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప్ర‌స్తుతం టెలికం సేవ‌లు మ‌రింత ఖ‌రీదు అవుతున్నాయి. ఫోన్ల‌ను ప్ర‌తి నెలా రీచార్జి చేసుకోవ‌డం పేద‌ల‌కు భారంగా మారింది. స‌రిగ్గా ఈ పాయింట్ ను వైసీపీ గుర్తించి జియో ఫోన్లు తీసుకున్న వాళ్ల‌కు ఫ్రీ రీచార్జి చేసే స్కీమ్ ను (Jagan manifesto) ప్ర‌క‌టించడానికి సిద్ద‌మ‌య్యారు. ఫైబ‌ర్ నెట్ ద్వారా టీవీల‌ను ఉచితంగా చూసేలా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని టాక్. ప్ర‌స్తుతం ఏపీ ఫైబర్ నెట్ కొన్ని ప్రాంతాల్లో లేదు. వ‌చ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయిలో ఫైబ‌ర్ నెట్ సేవ‌ల్ని 100శాతం తీసుకెళ్ల‌నుంది. ఆ త‌రువాత ఎన్నిక‌ల ఆఫ‌ర్ గా ఉచితంగా ఫైబ‌ర్ నెట్ సేవ‌ల్ని అందించే అంశాన్ని మేనిఫెస్టోలోకి ఎక్కించ‌బోతున్నారు.

Also Read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

ప్ర‌తి ఒక్క‌రి చేతిలో సెల్ ఫోన్ ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించి వైసీపీ రాబోయే ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఫ్రీ వైఫై సేవ‌లు, ఉచితంగా ఫోన్ రీచార్జి, ఉచితంగా ఫైబ‌ర్ నెట్ సేవ‌ల్ని అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కంటే మొబైల్ ఫోన్ల ఉచిత రీచార్జి స్కీమ్ మ‌హిళ‌ల్ని బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది. అంతేకాదు, సీరియ‌ల్స్ చూడ‌కుండా ఉండ‌లేని మ‌హిళ‌లు చాలా మంది ఉన్నారు. వాళ్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఉచితంగా ఫైబ‌ర్ నెట్ ద్వారా టీవీ క‌నెక్ష‌న్ ఉచితంగా ఇవ్వడానికి (Jagan manifesto) ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మేనిఫెస్టో కంటే క‌లర్ ఫుల్ గా ఉండేలా ఉచిత సాంకేతిక సేవ‌ల్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల‌కు యాడ్ చేస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, రిల‌యెన్స్ జియోకు చెందిన 100 ట‌వ‌ర్ల‌ను గురువారం బ‌ట‌న్ నొక్కి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!