Jagan London tour : జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వెనుక‌ బ్లాక్ ..!

Jagan London tour : ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్ప‌టికీ కేసులు గురించి అంటూ ప్ర‌చారం స‌ర్వ‌సాధారణంగా మారింది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 04:13 PM IST

Jagan London tour : ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్ప‌టికీ కేసులు గురించి అంటూ ప్ర‌చారం స‌ర్వ‌సాధారణంగా మారింది. అలాగే, లండ‌న్ ఫ్లైట్ ఎక్కిన వెంట‌నే డ‌బ్బు సంచులను ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేస్తుంటారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. గ‌త నాలుగున్న‌రేళ్లుగా లిక్క‌ర్, ఇసుక త‌దిత‌ర రూపాల్లో ల‌క్ష‌ల కోట్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోగేసుకున్నార‌ని టీడీపీ చేసే ఆరోప‌ణ‌. ఆ డ‌బ్బును విదేశాల్లో దాచ‌డానికి తీసుకెళుతున్నార‌ని త‌ర‌చూ ప్ర‌త్య‌ర్థుల నుంచి వినిపించే మాట‌. ఇలాంటి వ్యాఖ్య‌లు అధికారంలో ఉన్న నేత‌ల మీద రావ‌డం స‌హ‌జంగా మారింది. అందుకు త‌గిన విధంగా ప్ర‌త్యేక విమానాల‌ను నేత‌ల వాడ‌డం మ‌రింత బ‌లం చేకూరుతోంది.

ల‌క్ష‌ల కోట్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోగేసుకున్నార‌ని టీడీపీ చేసే ఆరోప‌ణ‌ (Jagan London tour)

ప్ర‌తి ఏడాది లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు (Jagan London tour) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దంప‌తులు వెళుతుంటారు. సీబీఐ కోర్టు ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని ఈ ఏడాది కూడా ఫ్లైట్ ఎక్కారు. స‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్థంతి సంద‌ర్భంగా శ‌నివారం ఇడుపుల‌పాయ వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దంప‌తులు రాత్రి 9గంట‌ల 30 నిమిషాల ప్రాంతంలో ప్ర‌త్యేక విమానంలో లండ‌న్ వెళ్లారు. ఈనెల 12న తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. ప‌ది రోజుల పాటు వాళ్ల ప‌ర్య‌ట‌న ఉంది. సీబీఐ కోర్టులో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విజ్ఞ‌ప్తి చేసిన మేర‌కు యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల‌కు అనుమ‌తి కోరారు. అంటే ఆ దేశాల‌కు వెళ‌తారా? అంటే ప్ర‌త్య‌ర్థులు మాత్రం టాక్స్ ఫ్రీ ఉండే కంట్రీల‌కు వెళ‌తార‌ని అనుమానిస్తున్నారు.

లిక్క‌ర్ స్కామ్ అతి పెద్ద కుంభ‌కోణం అంటూ చంద్ర‌బాబు అండ్ టీమ్

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లండ‌న్  (Jagan London tour) వెళ్ల‌డానికి నాలుగు రోజుల ముందు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇసుక స్కామ్ మీద ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. సుమారు రూ. 40వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని తేల్చారు. వీటితో పాటు లిక్క‌ర్ స్కామ్ అతి పెద్ద కుంభ‌కోణం అంటూ చంద్ర‌బాబు అండ్ టీమ్ ఆరోపిస్తున్నారు. దేశంలో మ‌రెక్కడా లేని విధంగా కేవ‌లం ఏపీలో మాత్ర‌మే క‌రెన్సీ నోట్లు ఇస్తేనే మ‌ద్యం విక్ర‌యిస్తారు. ఆన్ లైన్ చెల్లింపులు చేయ‌డం ద్వారా మ‌ద్యం విక్ర‌యాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఎప్పుడో ఆపేసింది. అలాగే, ఇసుక విక్ర‌యాల‌ను టెండ‌ర్ ద్వారా ఒకే కంపెనీకి రాష్ట్ర వ్యాప్తంగా అప్ప‌గించింది. ఇలా చేయ‌డం వెనుక బ్లాక్ మ‌నీ దందా తాడేప‌ల్లి కేంద్రంగా న‌డుస్తోంద‌ని టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. క‌నీసం ల‌క్ష కోట్లు ఈ నాలుగున్న‌రేళ్ల‌తో జ‌గ‌న్మోహన్ రెడ్డి దోచేశాడ‌ని టీడీపీ చెబుతోన్న లెక్క‌. దాన్ని దాచుకోవ‌డానికి ప్ర‌త్యేక విమానంలో ప్ర‌తి ఏడాది లండ‌న్ వెళ‌తాడ‌ని ఆరోపిస్తోంది.

Also Read : YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయ‌ణం!జ‌గ‌న్ ల‌క్ !!

ఇక పలుమార్లు సీఎం హోదాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టికీ కేసుల మాఫీ గురించి వెళ్లాడ‌ని వినిపిస్తోంది. ప్ర‌త్యేకించి సీబీఐ కేసు విచార‌ణ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఢిల్లీ ఫ్లైట్ ఎక్క‌డం యాదృశ్చికంగా క‌నిపిస్తోంది. అందుకే, ప్ర‌త్య‌ర్థులు చేసే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుతోంది. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీకి అండ‌గా వైసీపీ నిల‌బడుతోంది. మోడీ, అమిషా అడుగు జాడ‌ల్లో ఆయ‌న న‌డుస్తున్నార‌ని అన‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు బోలెడు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు తాడేప‌ల్లి వ‌ర‌కు తాకింది. దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రాన్ని ఆశ్ర‌యించార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే, ప్ర‌త్యేక హోదా నుంచి రాష్ట్రం కోసం ఏమీ అడ‌గ‌కుండా ఆయ‌న కేంద్రంతో లాలూచీ ప‌డ్డార‌ని చెబుతోంది. ఇక వైపు ఢిల్లీ మ‌రో వైపు లండ‌న్ చ‌క్క‌ర్లు కొట్ట‌డం వెనుక కేసులు, అక్ర‌మ సంపాద‌న దాచుడు అనే అనుమానాన్ని టీడీపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : Jagan Board : గోవిందా..హ‌ల లూయా.!TTD భాగోతం!!

గ‌తంలోనూ లండ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను కూడా టీడీపీ బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. అన‌ధికారికంగా దావోస్, స్విర్జార్లాండ్ వెళ్లార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. బ్లాక్ మ‌నీ దాచుకోవ‌డానికి ఆ దేశాల‌కు వెళ్లార‌ని కొన్ని ఆధారాల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. ఇప్పుడు ప‌ది రోజ‌లు ప‌ర్య‌ట‌న నిమిత్తం లండ‌న్ వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టూర్ మీద టీడీపీ ఒక క‌న్నేసింది. ఆయ‌న అన‌ధికారికంగా ఎక్కడ‌కు వెళ్లారు? అనేది బ‌య‌ట పెట్టేందుకు సిద్దంగా ఉంది. ఆడిట‌ర్, ఎంపీ అయిన విజ‌య‌సాయిరెడ్డి కూడా విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి తీసుకోవ‌డం పలు అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌త్య‌ర్థులు చేసే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లండ‌న్ టూర్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.