Jagan London Secret : లండన్లో హరీశ్ సాల్వే మూడో పెళ్లి నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆ పెళ్లి వేడుకకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి వెళ్లారని టీడీపీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తోంది. ప్రత్యేక విమానంలో ఆయన శనివారం రాత్రి లండన్ వెళ్లారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈనెల 12వ తేదీన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. అంత వరకు మాత్రమే అధికారిక షెడ్యూల్ ను సీఎంవో ఆఫీస్ విడుదల చేసింది. కానీ, ఆ పది రోజులు లండన్లో ఏమి చేస్తారు? అనేది మాత్రం రహస్యంగా ఉంచింది.
ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి లండన్.(Jagan London Secret)
హరీశ్ సాల్వే అత్యంత ఖరీదైన లాయర్. ఆయన్ను కుబేరులు మాత్రమే భరించగలరు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులతో పాటు అమరావతి కేసును కూడా సాల్వే చూస్తున్నారు. అంతేకాదు, అంబానీ, ఆదానీ కంపెనీ కేసులను సాల్వే వాదిస్తుంటారు. ఆ రేంజ్ లాయర్ హరీశ్ సాల్వే. ఆయన రెండు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో మూడో పెళ్లి చేసుకున్నారు. సుమారు 68 ఏళ్ల వయస్సును సాల్వే మూడోసారి ముచ్చటగా వివాహాన్ని లండన్ వేదికగా జరుపుకున్నారు. ఆ వేడుక కోసం అంబానీ, ఆదానీలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయినట్టు తెలుస్తోంది. ఆ మేరకు (Jagan London Secret) టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
సాల్వే మూడోసారి ముచ్చటగా వివాహాన్ని లండన్ వేదికగా
ఖరీదైన లాయర్ మూడో పెళ్లికి తగిన రీతిలో ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లారని సోషల్ మీడియాలో పోస్టులు హొరెత్తుతున్నాయి. అత్యంత ఖరీదైన బహుమానం కూడా విమానంలో తీసుకెళ్లాలని జోడిస్తోంది. సుమారు 50కోట్ల ఖర్చుతో ఆయన లండన్ టూర్ ఉందని అంచనా వేస్తోంది. వాస్తవంగా కుమార్తెల వద్దకు వెకేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్లలేదట. ఆయన కుమార్తెలు ఒకరు ప్యారిస్ మరొకరు అమెరికాలో చదువుతున్నారని టీడీపీ సానుభూతి మీడియా చెబుతోంది. విదేశాలకు వెళ్లడానికి కోర్టుల నుంచి అనుమతి కోసం మాత్రమే కుమార్తెల కోసం వెకేషన్ అంటూ పిటిషన్ పెట్టుకున్నారని, వాస్తవానికి (Jagan London Secret)అందుకు కాదని వాదిస్తోంది.
Also Read : YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయణం!జగన్ లక్ !!
హరీష్ సాల్వె పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోర్టులను జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించలేరు. ఎందుకంటే, ఆయన కేసులను కూడా సాల్వే వాదిస్తున్నారు కనుక, కుమార్తెల కోసం అంటూ పిటిషన్ పెట్టుకున్నారని ప్రత్యర్థుల ఆరోపణ. అంతేకాదు, తొలుత అక్రమ సంపాదన దేశం దాటించేందుకు వెళుతున్నారని తొలుత ప్రచారం చేసింది. గత ఏడాది లండన్ వెళ్లిన సందర్భంగా కూడా ఇలాంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. విదేశాల్లో అక్రమ సంపాదన దాచేందుకు వెళ్లాడని సోషల్ మీడియా (Jagan London Secret) వ్యాప్తంగా హొరెత్తింది. దావోస్, స్విర్జర్లాండ్ వెళ్లారని అప్పట్లో వచ్చిన ప్రచారం. ఆయన లండన్లోని కుమార్తెల కోసం అంటూ అక్రమ సంపాదన దాచుకోవడానికి దావోస్ వెళ్లారని అప్పట్లో వినిపించిన ఆరోపణ. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలు తొలి రెండు రోజులు వినిపించినప్పటికీ తాజాగా మాత్రం హరీశ్ సాల్వే పెళ్లికి వెళ్లారని టీడీపీ సోషల్ మీడియా నిర్థారించేస్తోంది.
Also Read : Jagan London tour : జగన్ పర్యటన వెనుక బ్లాక్ ..!
సీబీఐ, ఈడీ కేసులను జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. వాటిని సాల్వే వాదిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కేసుల నుంచి బయటపడ్డ ఆయనకు తాజాగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు చికాకు కలిగిస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు. ఆయనతో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు. ఇక వాళ్ల జతకు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చేరతారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. కానీ, సీబీఐ ఆయన్ను రహస్యంగా అరెస్ట్ చేసి, విడుదల చేసింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి లాబీయింగ్ ఎంత బలమైనదో తెలిసింది. ఢిల్లీ బీజేపీ పెద్దలతో ఆయన నడిపే లాబీయింగ్ ఫెవికాల్ కంటే బలంగా ఉందని ప్రత్యర్థులకు బోధపడింది. ఆ కేసును కూడా హరీశ్ సాల్వే డీల్ చేస్తున్నారట. అందుకే, ప్రాణ సమానంగా ఉండే సాల్వే మూడో పెళ్లికి వెళ్లకపోతే బాగుండదని జగన్మోహన్ రెడ్డి లండన్ చెక్కేశారట. పనిలోపనిగా అక్రమ సంపదను ప్రత్యేక ఫ్లైట్ ఎక్కించారని సర్వత్రా వినిపిస్తోన్న ఆరోపణ. ఇలాంటి ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. పది రోజుల జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా ఆయన వ్యక్తిగతమంటూ ఆ పార్టీకి చెందిన ఒక లీడర్ అంటున్నారు.