Site icon HashtagU Telugu

AP Schemes: విద్యతోనే మహిళా సాధికారత

Polavaram

Jagan Imresizer

బాలికా విద్యను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం వైఎస్​ జగన్మోహన్​ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిష్ఠాత్మక పథకం కల్యాణమస్తు, షాదీ తోఫాలను ప్రారంభించారు. వాటికి ప్రత్యేక వెబ్​సైట్​ను ఆవిష్కరించారు. ఈ పెళ్లి కానుకను అందుకోవాలంటే అమ్మాయి కనీసం పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధనను విధించారు. పాఠశాలల్లో బాలికల శాతాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిబంధనను చేర్చారు.

ఈ పథకాలు అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పథకానికి అర్హత సాధించాలంటే వధువుతో పాటు వరుడు కూడాకనీసం పదో తరగతి దాకా చదువుకుని ఉండాలి. అంతేగాకుండా వధువు వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలన్న షరతునూ విధించారు.

ఇదీ ప్రభుత్వం అందించే సాయం…

‌‌– ఎస్సీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.1,20,000
– ఎస్టీలకు రూ.1,00,000
– కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ.1,20,000
– బీసీలకు రూ.50,000
– కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.75,000
– మైనారిటీలకు రూ.1,00,000
– దివ్యాంగులకు రూ.1,50,000
– నిర్మాణ కూలీలకు రూ.40,000

గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పేదింటి ఆడపిల్లలకు ఇచ్చే పెళ్లి కానుకను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్​ ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగు ఇది.