Jagan Kuppam : కుప్పం వైసీపీ అభ్యర్ధికి భారీ ఆఫర్ ప్రకటించిన జగన్..

చంద్రబాబు (Chandrababu) అడ్డాలో జగన్ (Jagan)..నిప్పులు చెరిగారు..కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిల‌బెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జ‌లాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా ద్వారా కుప్పంకు […]

Published By: HashtagU Telugu Desk
Jagan Speech Kuppam

Jagan Speech Kuppam

చంద్రబాబు (Chandrababu) అడ్డాలో జగన్ (Jagan)..నిప్పులు చెరిగారు..కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిల‌బెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జ‌లాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు అందించినట్లు జగన్ పేర్కొన్నారు. ‘672 కి.మీ దూరం నుంచి కృష్ణా జలాలను ఇక్కడికి తెచ్చాం. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం. కుప్పంకే నీళ్లు ఇవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తాడు. ఇన్నాళ్లూ చంద్రబాబును భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ బాబు ఫై ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కుప్పంలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా జగన్ అడుగులేశారు. రెగ్యులర్ గా సభలో జగన్ ఎలా మాట్లాడతారో తెలియంది కాదు..కానీ ఈరోజు కుప్పం సభ ప్రసంగం ఆద్యంతం నియోజకవర్గం చుట్టూనే తిరిగింది. కుప్పంకు అందిన పథకాలనే చివరి వరకూ విడమర్చి చెప్పుకొచ్చారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కుప్పంలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తామన్నారు. వంచన, మోసం, కుట్రలు, వెన్నుపోటే బాబు మార్క్ రాజకీయమని దుయ్య బట్టారు. ‘ప్రజలకు ఏం మంచి చేశారో బాబు చెప్పడు. అందుకే దత్త పుత్రుడితో ప్యాకేజీ గురించి మాట్లాడుతాడు. వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా? అని అడిగితే స్పందించడు’ అని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా అందిస్తున్న మనసున్న ప్రభుత్వం తమదని జగన్ పేర్కొన్నారు. ’57 నెలల్లో కుప్పంలోని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1400 కోట్లు జమ చేశాం అని , నా మీద కోపం వస్తే చంద్రబాబు పులివెందులను తిడతాడు.. కానీ కుప్పాన్ని నేను ఏ రోజూ ఏమీ అనలేదు. చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి ఖాతాల్లో పడిందా? పెన్షన్లు ఇంటికి వచ్చాయా? ఆర్బీకే వ్యవస్థ ఉందా? విలేజ్ క్లినిక్లు ఉన్నాయా? ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు. అలాగే కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్, MLC భరత్ మాట్లాడుతూ.. ’40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన ముందు మీరెంత అని చంద్రబాబు అంటుంటారు. కానీ గత ఐదేళ్లలో సీఎం జగన్ కుప్పంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసిన ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా?’ అని మహేష్ డైలాగ్ కొట్టారు.

Read Also :Nara Chandrababu Naidu : ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి.. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు

  Last Updated: 26 Feb 2024, 07:33 PM IST