Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) మీద జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు మ‌లుపు తిరిగింది.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 01:50 PM IST

విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) మీద జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు మ‌లుపు తిరిగింది. ఆ రోజు కోడి క‌త్తి కేసుగా ప్రాచుర్యం పొందిన హ‌త్యాయ‌త్నం(Attempt Murder) కేసు రాజ‌కీయ రంగును పులుముకుంది. ఆ ఘ‌ట‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అప్ప‌ట్లో సృష్టించార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసు వెనుక కూడా పీకే వ్యూహం ఉంద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. అయితే, కోడి క‌త్తి కేసులోని ప్ర‌ధాన నిందితుడు శ్రీనివాస్ వైసీపీ సానుభూతిప‌రుడ‌ని ఆల‌స్యం వెలుగు చూసింది.

విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద హ‌త్యాయ‌త్నం(Jagan) 

ప్ర‌స్తుతం శ్రీనివాస్ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉంటున్నాడు. వాయిదాల ప్ర‌కారం ట్ర‌య‌ల్ కోర్టుకు శ్రీనివాస్ ను పోలీసులు హాజ‌రుప‌రుస్తున్నారు. తాజాగా ట్ర‌య‌ల్ కోర్టుకు తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ క‌మాండెంట్ రాఘ‌వ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. దీంతో కేసుకు సంబంధించిన ట్ర‌య‌ల్ షెడ్యూల్ మొత్తాన్ని కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు ఏసీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CM YS Jagan: సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

2019 ఎన్నిక‌ల‌కు ముందుగా విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద శ్రీనివాస్ కోడి క‌త్తితో దాడికి(Attempt Murder) దిగాడు. గాయం అయిన త‌రువాత నేరుగా హైద‌రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరారు. ఏపీ ప్ర‌భుత్వం, వైద్యుల ప్ర‌మేయం లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. హ‌త్యాయ‌త్నం జ‌రిగిన ప్రాంతం కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోనిది కావ‌డంతో ఎన్ ఐఏ విచార‌ణ‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆ కేసును విచార‌ణ చేస్తూ తొలుత నిందితుడు శ్రీనివాస్ ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపింది. ఇటీవ‌ల బాధితుడు కుటుంబీకులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కు వ‌చ్చారు. అపాయిట్మెంట్ ను కోరుతూ రాజ‌మండ్రి జైలు నుంచి శ్రీనివాస్ ను బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని అభ్య‌ర్థించారు.

బాబాయ్ వివేకా హ‌త్య‌ను కూడా ఎన్నిక‌ల‌కు వాడుకున్నార‌ని టీడీపీ..

రాజ‌కీయంగా సానుభూతి కోసం కోడి క‌త్తి కేసును సృష్టించార‌ని తొలి నుంచి టీడీపీ చెబుతోంది. అంతేకాదు, బాబాయ్ వివేకా హ‌త్య‌ను కూడా ఎన్నిక‌ల‌కు వాడుకున్నార‌ని టీడీపీ నేత‌లు త‌ర‌చూ చేసే ఆరోప‌ణ‌లు. ఆ రెండు కేసులు ఇప్పుడు సెంట్ర‌ల్ ఎజెన్సీల ప‌రిధిలోకి వెళ్లాయి. విచార‌ణ కొన‌సాగుతోంది. ఎన్ఐఏ కోర్టు తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కూడా కోర్టుకు హాజ‌రు కావాల‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంకో వైపు బాబాయ్ హ‌త్య కేసును కూడా దూకుడుగా సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అవినాష్ ను విచారించిన సీబీఐ కొన్ని కీల‌క అంశాల‌ను రాబ‌ట్టింది. హ‌త్య జ‌రిగిన త‌రువాత ముందు కూడా అవినాష్ సెల్ ఫోన్ నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, భార‌త‌, వైఎస్ కుటుంబంలోని కీల‌క వ్య‌క్తుల‌కు ఫోన్లు వెళ్లాయ‌ని అనుమానిస్తోంది.

Also Read : YCP Jagan : నాడు మ‌రో ఎన్టీఆర్,ఎమ్జీఆర్ నేడు ప‌ల్నాడులో జ‌గన్ `సింహ‌`నాదం!

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సానుభూతి క‌ల్పించిన కోడి క‌త్తి, బాబాయ్ హ‌త్య రెండు కేసుల విచార‌ణ వేగంగా జ‌రుగుతున్నాయి. ఆ రెండు కేసుల్లోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నీడ క‌నిపిస్తోంద‌ని టీడీపీ తొలి నుంచి చేస్తోన్న ఆరోప‌ణ‌. దీంతో ఈ రెండు కేసుల్లో వ‌చ్చే అంతిమ తీర్పు 2024 లో ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పుతాయ‌ని భావించొచ్చు.