Site icon HashtagU Telugu

AP : ఐదేళ్ల తర్వాత బయటకొచ్చిన కోడికత్తి శ్రీను..కొడుకును చూసి భావోద్వేగానికి గురైన తండ్రి

Kodisrinu

Kodisrinu

కోడి కత్తి కేసు (Kodi Kathi Case) లో ఐదేళ్లుగా జైలుకే అంకితమైన శ్రీనివాస్ (Srinivas)..ఎట్టకేలకు బెయిల్ ఫై బయటకు వచ్చారు. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు శుక్రవారం వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి కోడికత్తి శ్రీను విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సుమారు ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో.. శ్రీనివాస్ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాస్ విడుదలకు కారణమైన న్యాయవాదులను , ఎస్సీ సంఘాల నేతలను హత్తుకుని తన కృతజ్ఞతను తెలియజేసారు.

Read Also : Group 4 Results : గ్రూప్-4 ఫ‌లితాలను విడుదల చేసిన TSPSC