Jagan : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి – జగన్ సంచలన ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది

Published By: HashtagU Telugu Desk
Jagan Emoshanal

Jagan Emoshanal

ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం మీరు మాపై దాడి చేసారు..ఇప్పుడు మా టైం వచ్చింది అంటూ టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. తమపై దాడులు చేసిన వారిపై పగ తీర్చుకుంటున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేసారు.

”రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు సైతం..వైసీపీ నేతలు కవ్వింపు చర్యలను పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి.. నేతలు అలర్ట్‌గా ఉండాలి. దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి. పోలీసు అధికారులు శాంతి భద్రతలు అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోండి’ అని చంద్రబాబు సూచించారు.

Read Also : Chandrababu Take Oath : కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

  Last Updated: 07 Jun 2024, 09:59 PM IST