Jagan Jail Operation : రాజ‌మండ్రి జైలుపై జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ! సూప‌రింటెండెంట్ కావలెను.!

Jagan Jail Operation: `వినాశ‌కాలే విప‌రీత బుద్ధి` అంటూ పెద్ద‌లు సామెత‌.దాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ కు వ‌ర్తింప చేస్తున్నారు టీడీపీ నేత‌లు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 02:38 PM IST

Jagan Jail Operation: `వినాశ‌కాలే విప‌రీత బుద్ధి` అంటూ పెద్ద‌లు సామెత‌. దాన్ని ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు వ‌ర్తింప చేస్తున్నారు టీడీపీ నేత‌లు. ఆయ‌న చ‌ర్య‌ల కార‌ణంగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు సూప‌రింటెండెంట్ ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి కూడా ఎవ‌రూ ముందురాని దుస్థితి ఏర్ప‌డింది. కొన్ని నెల‌ల క్రితమే సూప‌రింటెండెంట్ గా రాహుల్ ను ఏపీ స‌ర్కార్ నియ‌మించింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌ను త‌ట్టుకోలేక లీవ్ మీద వెళ్లిపోయారు. ఇప్పుడు ఎవ‌ర్ని అక్క‌డ నియ‌మించాలి? అనేది ప్ర‌భుత్వం ముందున్న పెద్ద స‌వాల్.

ఏపీ జైళ్ల శాఖ  డీఐజీ  ఇంచార్జిగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్(Jagan Jail Operation) 

ప్ర‌స్తుతం ఏపీ జైళ్ల శాఖ  డీఐజీ  ఇంచార్జిగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు (Jagan Jail Operation) ఉన్నారు. ఫుల్ టైమ్ సూప‌రింటెండెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. దానికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌ను య‌థాత‌దంగా అమ‌లు చేయ‌లేక‌పోవ‌డం. జైళ్లకు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు ఉంటాయి. వాటిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త అక్క‌డి ఇంచార్జి మీద ఉంటుంది. ధిక్క‌రిస్తే, న్యాయ‌ప‌ర‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. అందుకు సిద్ద‌ప‌డే అధికారి కోసం అన్వేషిస్తోంది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్‌.

రాజారావును నెల్లూరులోని కేంద్ర కారాగారాల శిక్షణ ప్రిన్సిపాల్‌గా

కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు సూప‌రింటెండెంట్ గా రాజారావు ఉన్నారు. అప్ప‌ట్లో టీడీపీ ఎమ్మెల్యే భ‌వానీ, వాసుల‌ను ఆ జైలుకు సీఐడీ పంపింది. చిట్ స్కామ్ అంటూ కేసులు పెట్ట‌డం ద్వారా వాళ్లిద్ద‌రూ రిమాండ్ మీద ఆ జైలుకు వెళ్లారు. ఆ సందర్భంగా ములాఖ‌త్ విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సీరియ‌స్ అయింది. జైల్లో రాచ‌మ‌ర్యాద‌లు ఇస్తున్నార‌ని భావించింది. మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్, మాజీ సీఎం చంద్ర‌బాబుకు అప్ప‌ట్లో ములాఖ‌త్ ఇవ్వ‌డాన్ని త‌ప్పుగా భావించింది. వెంట‌నే రాజారావును నెల్లూరులోని కేంద్ర కారాగారాల శిక్షణ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది. ఆయ‌న స్థానంలో విశాఖ సెంట్ర‌ల్ జైలు సూప‌రింటెండెంట్ గా ఉన్న రాహుల్ ను రాజ‌మండ్రి జైలుకు బ‌దిలీ చేయ‌డం అప్ప‌ట్లో (Jagan Jail Operation) వివాద‌స్ప‌దం అయింది.

చంద్ర‌బాబు కుటుంబానికి ములాఖ‌త్

కొన్ని నెల‌ల క్రితం రాజ‌మండ్రి సూప‌రింటెండెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాహుల్ ప్ర‌స్తుతం అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్నారు. అదే జైలుకు రిమాండ్ మీద చంద్ర‌బాబును ఈనెల 10వ తేదీన అర్థ‌రాత్రి త‌రువాత త‌ర‌లించారు. మాజీ సీఎంగా చంద్ర‌బాబుకు గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం పాటు పరిపాల‌న చేసిన ఆయ‌న‌కు త‌గిన గౌర‌వం అక్క‌డ ఇచ్చారు. మ‌రుస‌టి రోజు జైలులోని స్కిల్ సెంట‌ర్ ను చూపించారు. అదే రోజు లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆ విష‌యం తెలిసిందట‌. అంతేకాదు, చంద్ర‌బాబు కుటుంబానికి ములాఖ‌త్ ఇచ్చారు. రెండు రోజుల త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ములాఖ‌త్ ఏర్పాట్లు చేశారు. స‌రిగ్గా ఇక్క‌డే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `ఇగో` దెబ్బ‌తింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్. అంతే, వెంట‌నే రాహుల్ బ‌దిలీకి రంగం సిద్ధం అయింది. నేరుగా బ‌దిలీ చేస్తే అభాసుపాల‌వుతామ‌ని భావించిన జ‌గ‌న్ టీమ్ రాహుల్ ను (Jagan Jail Operation) లీవ్ మీద వెళ్ల‌మ‌ని సంకేతాలు ఇచ్చార‌ట‌.

Also Read : CBN Jail : ఏపీ కోర్టుల్లో చెల్ల‌ని`లూథ్రా`! జైలులో బాబుకు `క‌త్తి` క‌థ !!

ప్ర‌స్తుతం రాహుల్ లీవ్ మీద వెళ్లిపోయారు. ఆయ‌న స్థానంలో ఎవ‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదు. దీంతో జైళ్ల శాఖ డీఐజీ ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కావ‌డానికి కొన్ని ఆంక్ష‌లు పెట్టారు. కుటుంబ స‌భ్యుల‌ను కూడా క‌ల‌వ‌కుండా క‌ట్ట‌డీ చేస్తున్నారు. మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం వారానికి మూడుసార్లు ములాఖ‌త్ కుటుంబ స‌భ్యుల‌కు ఉంటుంది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాన్ని కూడా కాద‌ని భువ‌నేశ్వ‌రికి ములాఖ‌త్ రిజ‌క్ట్ చేయ‌డం జ‌గ‌న్మోమ‌న్ రెడ్డి స‌ర్కార్ అరాచ‌కానికి ప‌రాకాష్ట‌గా టీడీపీ భావిస్తోంది.