Site icon HashtagU Telugu

Jagan:అవినాష్ ఔట్‌!తెర‌పై దుష్య‌త్ రెడ్డి,అభిషేక్ రెడ్డి?

Jagan

Jagan

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా? ఒక వేళ అరెస్ట్ అయితే ఆయ‌న స్థానం ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు? ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చెప్పాలి. కానీ, ఆయ‌న మౌనంగా తాడేప‌ల్లి కోట‌లో పావులు క‌దుపుతున్నారు. దీంతో ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు ఊహాగానాల‌ను పోగుచేసుకుంటున్నారు. కర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత అనినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్ట్ త‌థ్య‌మ‌ని తాజా టాక్‌. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యామ్నాయం దిశ‌గా క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థి విష‌యంలో అడుగులు వేస్తున్నార‌ని తాడేప‌ల్లి కోట‌లోని చ‌ర్చ‌.

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా? (Jagan)

ఒక వేళ అవినాష్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ అయితే, ఆయ‌న స్థానంలో డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్ రెడ్డి రంగంలోకి దిగుతార‌ని తాజా టాక్‌. ఆయ‌న ఎవ‌రో కాదు, వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అరెస్ట్ అయిన భాస్క‌ర్ రెడ్డి అన్న ప్ర‌కాశ్ రెడ్డి కుమారుడు వైఎస్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌యుడు. ప్ర‌స్తుతం పులివెందుల పార్టీ వ్య‌వ‌హారాల‌ను అవినాష్ తో పాటు డాక్ట‌ర్ అభిషేక్ రెడ్డి (AbhiShak Reddy) కూడా చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి పేరు రాజకీయ తెర మీదకు వచ్చింది. ఆయ‌న ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్‌. ఈయన భార్య కూడా డాక్ట‌ర్ . ప్ర‌స్తుతం అభిషేక్‌రెడ్డికి పులివెందుల పరిధిలోని సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలు అప్ప‌గించారు. ఎన్నిక‌ల నాటికి ఆయ‌న సామ‌ర్థ్యాన్ని ప‌రిశీలించ‌డం ద్వారా క‌డ‌ప ఎంపీగా ఆయ‌న్ను బ‌రిలోకి దించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌.

పులివెందుల పార్టీ వ్య‌వ‌హారాల‌ను అవినాష్ తో పాటు డాక్ట‌ర్ అభిషేక్ రెడ్డి

ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి (Avinash Reddy) రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు. అందుకే, నైస్ గా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేయ‌డానికి ప్ర‌త్యామ్నాయం సిద్ధం చేస్తున్నార‌ట‌. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి బ‌దులుగా దుష్యంత్ రెడ్డిని(Dushyanth Reddy) కూడా తెర‌మీద‌కు తీసుకొస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న స్వ‌గ్రామం క‌మలాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం తాటిమాకుల‌ప‌ల్లె. అక్క‌డ బాగా పేరుంది. కమ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగా తెలుసు. 2019లో జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా ప‌నిచేశారు. 2009లోనే దుష్యంత్ రెడ్డి క‌మ‌లాపురం టికెట్‌ ఆశించారు. ఈసారి ఖ‌చ్చితంగా టిక్కెట్ ఇస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అవినాష్ రెడ్డి కేసులో ఇరుక్కున్నారు. దీంతో ఆయ‌న స్థానాన్ని దుష్యంత్ రెడ్డి ద్వారా భ‌ర్తీ చేస్తార‌ని వినికిడి.

ప్ర‌త్యామ్నాయంగా డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి

పారిశ్రామికవేత్త అయిన దుష్యంత్ రెడ్డి అప్ప‌ట్లో క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరిగారు. వీర‌శివారెడ్డికి వైఎస్సార్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల కంటే అత‌నైతే ఉత్తమమని వైసీపీ నేతలు భావిస్తున్నారట. సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా సమీపిస్తుండగా దుష్యంత్‌రెడ్డి(Dushyanth Reddy) పేరు తెర‌పైకి రావ‌డం క‌డ‌ప జిల్లాలో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. రాబోవు రోజుల్లో అవినాష్ అరెస్ట్ త‌ప్ప‌ద‌ని భావిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) ప్ర‌త్యామ్నాయంగా డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి పేర్ల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం వాళ్లిద్ద‌రూ జ‌నంలోనే ఉన్నారు. రాబోవు ఎన్నిక‌ల నాటికి ఎవ‌రు చురుగ్గా ఉంటే వాళ్ల‌ను క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దింపుతార‌ని పులివెందుల టాక్‌. లేదంటే, ఏదో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం వాళ్లిద్ద‌రికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తార‌ని ప్ర‌చారం ఉంది.

Also Read : Avinash Reddy: అవినాష్ పై అనుమాలెన్నో..! సీబీఐ పిటిషన్‌ లో సంచలన మలుపు

గ‌త ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పులివెందుల‌తో పాటు క‌డ‌ప ఎంపీగా అవినాష్ రెడ్డి(Avinash Reddy) రాజ‌కీయాల‌ను నెరిపారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇష్ట‌మైన త‌మ్ముడిగా మెలిగారు. కానీ, వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఆయ‌న్ను వెంటాడింది. సీబీఐ ఆయ‌న్ను వ‌ద‌ల‌కుండా ఉండ‌లేమ‌ని చెబుతోంది. హ‌త్య‌కు సూత్ర‌ధారిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డ‌మే మార్గ‌మ‌ని న్యాయ‌స్థానాల‌కు తెలియ‌చేస్తోంది. అందుకే, ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల వైపు జ‌గ‌న్ (Jagan) దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. వై నాట్ పులివెందుట అంటూ టీడీపీ దూకుడుగా ఉన్న త‌రుణంలో క‌డ‌ప జిల్లా మీద ప‌ట్టుకోల్పోకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య ప్ర‌భావం ఎన్నిక‌ల మీద ప‌డ‌కుండా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక వేళ డాక్ట‌ర్ సునీతారెడ్డి పోటీ చేసిన‌ప్ప‌టికీ ఎదుర్కోనేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తోన్న క్ర‌మంలో దుష్యంత్ రెడ్డి, డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్ రెడ్డి(AbhiShek Reddy) పేర్లు తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Avinash Reddy: పులివెందులలో క్లూ కోసం సీబీఐ అన్వేషణ