AP Assembly : ఏపీ అసెంబ్లీలో అంత జగన్ బాధితులే – చంద్రబాబు షాక్

జగన్ ప్రభుత్వం లో కేసులు పెట్టిన వాళ్ళు అందరూ నిలబడాలి అనగానే పవన్ కళ్యాణ్ తో సహా అందరు నిలబడ్డారు

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 06:31 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly) భాగంగా ఈరోజు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన దగ్గరి నుండి వరుసగా సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలను ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు శాంతిభద్రతల అంశంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం..చంద్రబాబు మాట్లాడుతూ..2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది. నా మీద చిన్నప్పుటి నుంచి ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారు.

ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇలా ఎవర్ని వదిలిపెట్టకుండా అక్రమ కేసులు పెట్టారని బాబు వాపోయారు. అసలు జగన్ ప్రభుత్వం లో కేసులు పెట్టిన వాళ్ళు అందరూ నిలబడాలి అనగానే పవన్ కళ్యాణ్ తో సహా అందరు నిలబడ్డారు. ఇది చూసి ఒకిత్త బాబు ఆశ్చర్యానికి గురయ్యారు.

Read Also : Telangana Budget 2024 : గ్యారంటీలను గంగలో కలిపేసి బడ్జెట్ – కేటీఆర్

Follow us