Site icon HashtagU Telugu

Jagan : ప్రజలను మోసం చేయడంలో జగన్ ఫస్ట్ – షర్మిల

Jagan Sharmila

Jagan Sharmila

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) రెడ్డి తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆకుతోట గిరిజన కాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీ చేసారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రజలను ప్రతి విషయంలో మోసం చేశారని, ఆయన పాలనలో ప్రజలు నష్టపోయారని విమర్శించారు. సింగయ్య మరణ ఘటనపై స్పందిస్తూ జగన్ ప్రయాణ శైలే ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఇది ఫేక్ వీడియో అని వాదించటం దురదృష్టకరమన్నారు.

Hyderabad : బైక్‌పై 8 మందితో స్టంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన యువకులు

షర్మిల తన వ్యాఖ్యలలో జగన్‌కు నిబంధనలు పట్టవని, తన హయాంలో అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని విమర్శించారు. మూడు రాజధానుల విషయంలోనూ ప్రజలను తప్పుదారి పట్టించారని అన్నారు. పోలవరం, రుషికొండ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వ వైఖరి ప్రజల ఆస్తుల మీద దాడిలా మారిందని చెప్పారు. జగన్, మోదీకి మద్దతుగా వ్యవహరిస్తూ ప్రతి బిల్లును అంగీకరించారని ఆరోపించారు. వైఎస్సార్ పేరు చెప్పుకుంటూ జగన్ తన దారి తప్పుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రైతులకు రూ.20 వేల వేతన భరోసా ఇప్పటికీ అందలేదని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్లు వంటి అంశాల్లో ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగా ఆచరణలో పెట్టలేకపోయారని విమర్శించారు. చివరగా షర్మిల మాట్లాడుతూ తనకు జగన్‌తో విభేదాలున్నా, అది వ్యక్తిగతం కాదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు.