AP : జగన్ కు బీజేపీకి బానిస – వైస్ షర్మిల

వైఎస్సార్ కుమారుడు జగన్.. బీజేపీకి బానిస అని , గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Sharmila Ap

Sharmila Ap

ఏపీలో తన అన్న జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)…ఎన్నికల ప్రచారంలో తనదైన మాటల తూటాలను వదులుతూ వైసీపీ (YCP) నేతలకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం కడప లో తన ప్రచారాన్ని సాగిస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ కుమారుడు జగన్.. బీజేపీ(BJP)కి బానిస అని , గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ ను నిందితుడిగి తేల్చిందని అలాంటి నిందితుడికి జగన్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

తన బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలు తమకు ఎంతో ముఖ్యమైన ఓటు సాయంతో హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలన్నారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. “విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదు. హోదాపై బీజేపీ మోసం చేసింది., వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది.కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారు. మూడు సార్లు శంకుస్థాపన చేశారు. ఎంపిలు నిద్ర పోతున్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదు. కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం. కడప లైన్‌ను జగన్ వద్దన్నారట.” అని విమర్శించారు.

Read Also : Hijab Vs Rs 146 Crores : ‘హిజాబ్‌’ వ్యవహారంలో సంచలన తీర్పు.. రూ.146 కోట్ల పరిహారం!

  Last Updated: 06 Apr 2024, 03:44 PM IST