AP CM Jagan : జనంలోకి జగన్..

ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా ఎంపిక చేస్తూ..బిజీ గా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించగా..ఈసారి 175 కు 175 సాధించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇక […]

Published By: HashtagU Telugu Desk
Jagan Apologie

Jagan Apologie

ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా ఎంపిక చేస్తూ..బిజీ గా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించగా..ఈసారి 175 కు 175 సాధించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జనవరి 21 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ పడే వరకు ప్రజల్లో ఉండేందుకు జగన్ చూస్తున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు దీని విధివిధానాలపై ఎలాంటి సమాచారం లేకపోయినా పర్యటన ఉంటుందట. సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీలోని ముఖ్యులు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఎండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీని పేరుపై కూడా కసరత్తు విస్తృతంగా జరుగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ సీఎం టూర్‌పై క్లారిటీ రానుంది.

Read Also : Gangster Goldy Brar: ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌.. ప్రకటించిన కేంద్రం..!

  Last Updated: 01 Jan 2024, 07:12 PM IST