Site icon HashtagU Telugu

Chandrababu Naidu: జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ: మచిలీపట్నం సభలో చంద్రబాబు

Chandrababu Naidu, Jagan

Resizeimagesize (1280 X 720) (2)

మచిలీపట్నంలో జరిగిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి సూపర్ హిట్ అయింది. ఇటీవల చంద్రబాబు (Chandrababu) పాల్గొన్న కార్యక్రమాల్లో ఇదో పెద్ద రోడ్ షో అనుకోవచ్చు. లక్షలాది మంది జనం చంద్రబాబుకు నీరాజనం పలికారు. అడుగడుగునా ఆయనకు హారతులు, పూలాభిషేకం చేస్తూ బహిరంగ సభకు అభిమానులు చేరుకున్నారు. చంద్రబాబు (Chandrababu) పర్యటన అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇంత ఆలస్యమైనా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కేడర్‌కు పట్టుదల పెరిగింది అన్నారు చంద్రబాబు. అందుకే ఇప్పటి వరకు వేచి ఉన్నారని.. అడుగడుగునా ప్రజలు దారి పొడవునా కదిలి వచ్చారని అందుకే ఆలస్యం అయ్యిందన్నారు. ఆ జనం చూస్తే వైఎస్సార్‌సీపీ పని అయిపోయిందని తేలి పోయిందన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ లాంటి వ్యక్తి అంటూ చెప్పారు. తన ఆలోచన, బాధ ఎప్పుడూ రాష్ట్రం గురించే అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

వైఎస్సార్‌సీపీ పోతే తప్ప రాష్ట్రంలో బిడ్డలకు భవిష్యత్ లేదని.. ఈ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి అన్నారు. జగన్ బటన్ నొక్కి ఇచ్చిన సొమ్ము గురించి చెప్పారు. బటన్ నొక్కి ఎన్ని లక్షల కోట్లు తిన్నావో చెప్పగలవా అన్నారు. ఆడవారికి ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎన్టీఆర్.. డ్వాక్రా సంఘాలు పెట్టింది తాను అన్నారు. 2014 నుంచి ఒక్కో డ్వాక్రా మహిళలకు 20,000 ఇచ్చామని.. అన్నా క్యాంటీన్ పెడితే జగన్ దాన్ని మూసేశారన్నారు. చంద్రన్న భీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫా వంటి పథకాలు అన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు.

జగన్ ప్రజా ధనం దోచుకుని బొక్కింది రూ. 2 లక్షల కోట్లు.. జిల్లాలో ఇసుక ఎవరు బొక్కుతున్నారు, బంగారం అవ్వడానికి కారణం ఎవరు? జగన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. ఇక్కడ ఒక నీతుల నాని ఉన్నారని, ఇసుక ఎక్కడికి పోతుందో ఈ నీతుల నాని చెప్పగలరా అన్నారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని, వేరే రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్స్ ఇక్కడ ఎందుకు దొరకడం లేదన్నారు. మద్యం షాప్స్‌లో ఆన్లైన్ లో డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క మద్యంలోనే జగన్ రూ.35 వేల కోట్లు కొట్టేశారని ఆరోపించారు.

Also Read: Karnataka Elections : 23 మంది అభ్య‌ర్థుల‌తో రెండో జాబితాను విడుద‌ల చేసిన క‌ర్ణాట‌క బీజేపీ

రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని.. ఇది చాలా ప్రమాదకరం అన్నారు. రాష్ట్రంలో పన్నులు, బాదుడు, ధరల పెంపుతో ఒక్కో కుటుంబంపై 3 లక్షల భారం మోపారని, అంటే 4.5.లక్షల కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని.. బయట రాష్ట్రాల వారు ఏపీ రాజధాని ఏది అంటే మన దగ్గర సమాధానం లేదన్నారు. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు.నాడు కట్టిన పట్టిసీమ వల్ల ఎంతో లబ్ధి జరిగిందని.. పోలవరం 72 శాతం పూర్తి చేస్తే, జగన్ దాన్ని గొదాట్లో కలిపారన్నారు. ఇక్కడ ఒక నీతులు చెప్పే నాని ఉన్నారని.. నీతుల ఎమ్మేల్యే జగన్ ఏది చెపితే అది మాట్లాడుతారన్నారు. పవన్ కళ్యాణ్‌పై మాట్లాడడమే ఈ నీతుల నానికి పనా? కొల్లు రవీంద్రపై హత్యా నేరం పెట్టీ జగన్ పైశాచిక ఆనందం పొందారన్నారు. దేశంలోనే జగన్ సంపన్న ముఖ్యమంత్రి.. 2004కు ముందు జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అంటూ నిలదీశారు.

కేంద్రం మెడలు వంచుతా అని..హోదా తెస్తాను అని జగన్ చెప్పారా లేదా అని ప్రశ్నించారు. మెడలు వంచలేదు.. మెడలు దించారంటూ సెటైర్లు పేల్చారు. బందరు పోర్టు ఏమయ్యిందో ఈ నీతుల నాని చెప్పాలి.. బందరులో ఏ పని చెయ్యాలి అన్నా కప్పం కట్టాల్సిందే అన్నారు. బైపాస్ రోడ్ లో ఒక వ్యక్తి మాల్ కట్టుకుంటే లంచం కోసం ఆయనకు అనుమతులు ఇవ్వలేదన్నారు. తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అంటే అనుమతులు ఇవ్వలేదన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు స్పీచ్ లో జగన్ , మాజీ మంత్రి పేర్ని నాని ని టార్గెట్ చేశారు. చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ హడావిడి బాగా కనిపించడం కోసమెరుపు.

Exit mobile version