Jagan : చెల్లెల్ని మిస్ అవుతున్న అంటూ జగన్ ఎమోషనల్..మరో డ్రామా అంటారా..?

వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు అడుగగా.. అవునని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు కాదు? తప్పకుండా మిస్ అవుతున్నా.

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 08:51 PM IST

వైస్ షర్మిల – జగన్ (YS sharmila – Jagan) కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు నడుస్తున్నాయి. తనకు రావాల్సిన ఆస్తిని సైతం జగన్ కాజేసాడని ఇన్ డైరెక్ట్ గా షర్మిల చెప్పుకొస్తుంది. ఈ ఆస్థి గొడవలే ఇద్దరి మధ్య వివాదాన్ని తెరలేపినట్లు తెలుస్తుంది. అసలు ఈరోజు జగన్ సీఎం కుర్చీ లో కుర్చున్నాడంటే అందులో షర్మిల పాత్ర చాల వరకు ఉంది. ఆరోజు జగన్ జైల్లో ఉండగా..షర్మిల రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి వైసీపీ ని జనాల్లోకి తీసుకెళ్లింది. అలాంటి షర్మిలనే ఈరోజు పక్కన పెట్టారు. అందుకే జగన్ అనే చాలు షర్మిల ఒంటికాలు మీద లేస్తుంది. ప్రస్తుతం అన్నను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది షర్మిల. తన ప్రచారంలోనూ ఎక్కువగా అన్ననే టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తూ వస్తుంది. బాబాయ్ ని చంపిన వ్యక్తులను చేరదీస్తున్నాడని ఆరోపిస్తూ వస్తుంది. జగన్ సైతం అదే రేంజ్ లో షర్మిల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నాడు. తన చెల్లెలు షర్మిల పచ్చ చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారితో చేతులు కలిపిందని , చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతుందని, బాబు చెప్పినట్లు చేస్తుందని ఆరోపిస్తూ వస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలఫై పలు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పుకొచ్చారు. తనకు, తన చెల్లెలు మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలపై జగన్ మాట్లాడారు. వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు అడుగగా.. అవునని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు కాదు? తప్పకుండా మిస్ అవుతున్నా. దురదృష్టం కొద్దీ ఆమె వెళ్లిపోయింది. అయితే ఆమెను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నా. ఆమె వెళ్లిపోయినా.. ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని జగన్ సమాధానం ఇచ్చారు. షర్మిలకు మంచి జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. దురదృష్టవశాత్తూ ఆమె తీసుకున్న లైన్ కారణంగా పరిస్థితులు అంత మంచిగా లేవు అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రానివ్వనందుకే మీ నుంచి షర్మిల, సునీత విడిపోయారా..? అనే ప్రశ్నకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. వారిద్దర్నీ పార్టీలోకి చేర్చుకుని ఉంటే అది కుటుంబ రాజకీయం అయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ మాటలు విన్న చాలామంది ఇదో కొత్త డ్రామా అని..పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ పలికి సింపతీ ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న గులకరాయి తో డ్రామా సృష్టించాడని, అది పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్లీ ఇలా కొత్త డ్రామాకు తెరలేపారని అంటున్నారు.

Read Also : AP : సీఎం రమేష్ అరెస్ట్.. తాడువ వద్ద ఉద్రిక్త వాతావరణం