Site icon HashtagU Telugu

Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..

Jagan Babu Ambati

Jagan Babu Ambati

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకిరిపై ఒకరు విమర్శస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్ నుండి తొలగించిన ప్రబుద్ధుడు చంద్రబాబు అని, ఆయనను ప్రజలు ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి.. ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని ఆయన వెల్లడించారు.

సీట్లు ఆడుక్కోవడానికి చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఆయన వెంట వెళ్లొద్దని, జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని అంబటి రాంబాబు అన్నారు. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయని ఆయన సెటైర్లు వేశారు. సీట్లు రాని బఫున్స్ ఏవేవో మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. బాలసౌరీ ఒక బఫున్ అంటూ ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే అక్కడ పడ్డాడని, అందరిని ముంచిపోయాడని, జగన్ అర్జునుడు…అభిమన్యూడు కాదని, ప్రతిపక్షాల పద్మ వ్యూహాలను చేదించి భయటకు వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

జనసేనకు మహా అయితే చంద్రబాబు 20 నుంచి 25 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, అంతకుమించి ఇవ్వరనేది జనసేన నేతలకు కూడా తెలిసిన జగమెరిగిన సత్యమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ సీట్ల ముష్టి తీసుకునే గత్యంతరం లేని పరిస్థితిలో జనసేన ఉందని ఆయన విమర్శించారు. టీడీపీ- జనసేన నేతలు ఎన్నికలకు ఇంకా సిద్ధం కాలేదని.. వైసీపీ ఎన్నికల విషయంలో దూసుకెళ్తోందని అంబటి అభిప్రాయపడ్డారు. జనసేన, టీడీపీ మాత్రం సీట్లు, నోట్లు లెక్కేసుకునే పనిలో ఉన్నారని సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు కనపడినవాళ్ళందరినీ రా.. కదలిరా అంటున్నారనీ, కానీ ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారని అంబటి రాంబాబు ఎద్దెవా చేశారు.

Read Also : Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్