Site icon HashtagU Telugu

Gautam Adani Bribery Case : పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్ల (PPA)లో జగన్ భారీ కుంభకోణం

Jagan Scam

Jagan Scam

భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ (Adani Group)పై కీలక ఆరోపణలు వెలుగులోకి రావడం.. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కు కూడా ముడుపులు అందినట్లు తేలాడడంతో దీనిగురించి అంత చర్చిస్తున్నారు. పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్ల (PPA)లో జగన్ భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. 2019 లో జగన్ (Jagan) అధికారంలోకి రాగానే గత చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పలు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసాడు. ఆ తర్వాత జగన్ చేసిన ఒప్పందాల కారణంగా తక్కువ ధరలకు విద్యుత్ సరఫరా చేసే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. విద్యుత్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ ఖర్చులు, మరియు ట్రాన్సపరెన్సీపై ప్రభుత్వ చర్యల వల్ల వినియోగదారులకు అదనపు భారాలు పడ్డాయనేది తెలుస్తుంది.దీని కారణంగా పేద మరియు మధ్య తరగతి కుటుంబాలపై అధికార ప్రభావం పడింది.

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ), ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయ శాఖ తాజాగా వెల్లడించిన విషయాలను బట్టి చూస్తే.. జగన్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. జగన్ అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం అప్పుల పాలై.. తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయింది. దాంతో కరెంటు చార్జీలు పెంచాల్సి వస్తున్నది. జగన్ తీసుకున్న రూ.1,750 కోట్ల లంచం – ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పుడు కరెంటు బిల్లు చెల్లించే ప్రతి ఒక్కరి పైనా జగన్ పెనాల్టీ వేశాడు. జగన్ గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. విద్యుత్‌ రంగంలో రూ.49,586 కోట్లు అప్పులు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్‌ రంగం రూ.47,741 కోట్లు నష్టపోయింది. పైగా ఈ లంచాలు…. జగన్‌ పాలనలో మొత్తమ్మీద విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది.

జగన్ తన లాభాల కోసం అత్యధిక ధరకు సౌర విద్యుత్ కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 15 2021న సెకీ తమకు టెండర్ వేసిన అదానీ సంస్థ రూ.2.49పైసలకే ఇవ్వాలనుకుంటోందని లేఖరాస్తే, 16నే ఏపీప్రభుత్వం ఆమోదించింది. సాయంత్రం లేఖవస్తే, మరునాటి ఉదయానికే, కేబినెట్ అప్రూవల్ పూర్తై, ఆమోదం తెలిపింది. అయితే రూ.2.49 కి కాదు…. రూ.2.90కు ఒప్పందం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచిన కాలంలోనే, గుజరాత్ ప్రభుత్వం రూ.1.99పైసలకు ఒప్పందాలు చేసుకున్నది.

జగన్ తన అవినీతి కోసం చేసిన ఈ పని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. విద్యుత్ ఉత్పత్తి తయారీ జరిగేది రాజస్థాన్ లో, అదానీ సంస్థ సోలార్ ప్యానెల్స్ కొనేది గుజరాత్ లో. రూ.30వేలకోట్ల జీఎస్టీ మొత్తం గుజరాత్ కు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాజస్థాన్ కు పోతుంటే, ఏపికి ఏమి ఉపయోగం? అయితే తన లంచాల కోసం జగన్ ఇవేమీ ఆలోచించలేదు. అదానీ దగ్గర లంచాలు తీసుకుని, మన కరెంటు బిల్లు పెంచేసాడు జగన్ రెడ్డి. మన కరెంటు బిల్లులు భారీగా పెరగటానికి కారణం, జగన్ తీసుకున్న లంచం….రూ.1,750 కోట్ల లంచం మొత్తం క్యాష్ రూపంలో ఒకేసారి తీసుకున్న జగన్ రెడ్డి.. సంచలన విషయాలు బయట పెట్టిన అమెరికా కోర్టు
7వేల మెగావాట్ల అదానీ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవడం వల్ల ఒక్కో మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున జగన్ కు లంచం ముట్టింది. ఇదే విషయం అమెరికా న్యాయస్థానం చెప్పింది.

ఎక్కడో రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును ఏపీకి సరఫరా చేసేందుకు ట్రాన్స్‌మిషన్‌ చార్జీల కింద యూనిట్‌కు 80 పైసలు అదనంగా పడుతుంది. ఆ మొత్తం విలువ 30,600 కోట్లు. అదే ఏడాది సెకీ నుంచి గుజరాత్‌ సర్కారు యూనిట్‌ రూ.1.99కే కొంటున్నా జగన్‌ పట్టించుకోలేదు. 50 పైసలు అదనంగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ‘మేం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అదానీతో కాదు. ఇంకా లంచాల ప్రస్తావన ఎక్కడిది?’ అని వైసీపీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. కానీ… అసలు డ్రామా అక్కడే ఉంది. సెకీ విక్రయించేది అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసే విద్యుత్తునే! అంటే… డిస్కమ్‌లు కొనేది అదానీ కరెంటునే! అంతా పారదర్శకంగా జరుగుతోందని చెప్పేందుకు ‘సెకీ’ని వాడుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తెలిపాయి. మరోవైపు… అదానీ, అజూర్‌ సంస్థలతో సెకీ ఒప్పందాన్ని చేసుకుందంటూ ఈ పీపీఏలను ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ… సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన ఎందుకు వస్త్తోందని జగన్‌ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

* గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్‌ రంగంలో రూ.49,586 కోట్లు అప్పులు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్‌ రంగం రూ.47,741 కోట్లు నష్టపోయింది. జగన్‌ పాలనలో మొత్తమ్మీద విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది. గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారు (యూనిట్ ధర రూ.3.87 నుంచి రూ.5.63 కి పెరిగింది) 50 నుంచి 200 యూనిట్లు కరెంటు వాడే పేదలు, మధ్య తరగతి పై భారం 78-98% వరకు పెరిగింది.

* విద్యుత్‌ సంస్థల అప్పు 78శాతం మేర పెరిగింది. విద్యుత్‌ వాడుకోకపోయినా కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు రూ.8వేల కోట్లు చెల్లించారు. పవన విద్యుత్‌ రంగంలో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్సిమిషన్‌ కోసమే రూ.3,850 కోట్ల నుంచి 4,350 కోట్ల వరకు అదనంగా చెల్లింపులు చేయాల్సి వచ్చింది. రాజస్థాన్ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు వల్ల ట్రాన్సిమిషన్‌ ఖర్చు అధికం. – కొనుగోలుధర రూ.2.49 పైసలు అయితే, డిస్కంలకు చేరేసరికి రూ.4.50పైసలు పడుతుంది.

Read Also : Jani Master Case Updates: జానీ మాస్టర్ కు భారీ ఊరట… ఆ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీమ్ ధర్మాసనం…