Site icon HashtagU Telugu

Jagan IPS-IAS : ఇద్ద‌రూ ఇద్ద‌రే.! టీడీపీ లీడ‌ర్ల‌కు ద‌డ ! జ‌గ‌న్ కు క‌ళ్లూ, చెవులు!

Jagan Ips-Ias

Jagan Ips Ias

ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం ఏపీ పోలీస్ కు (Jagan IPS-IAS) స‌వాల్ గా మారింది. నిఘా విభాగాధిప‌తిగా ఉన్న సీతారామాంజ‌నేయులు మూలాల్లోకి వెళుతోంది. ఆయ‌న ట్రాక్ రికార్డ్ ను ప్ర‌శ్నించేలా ఉంది. వివాద‌స్ప‌ద ఐపీఎస్ ఆఫీసర్ గా తొలి నుంచి సీతారాంజ‌నేయులు బాధితుల‌కు క‌నిపిస్తారు. తెలుగుదేశం పార్టీ(TDP) అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ లీడ‌ర్ల‌ను నిర్వీర్యం చేసిన రికార్డ్ ఉంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో టాక్ ఉంది. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న రోజుల్లో క‌ర్నూలు, గుంటూరు, విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ గా ఆయ‌న వివాద‌స్ప‌దం అయ్యారు. ప్ర‌ధానంగా గుంటూరు ఎస్పీగా ఆయ‌న ప‌నిచేసిన‌ప్పుడు ప‌ల్నాడు ఫ్యాక్ష‌న్ మీద లాఠీ ఝుళిపించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం ఏపీ పోలీస్ కు (Jagan IPS-IAS)

ఆనాడు ప‌ల్నాడులోని టీడీపీ లీడ‌ర్ బ్ర‌హ్మారెడ్డికి ఇచ్చిన కౌన్సిలింగ్ (Jagan IPS-IAS) ఆ పార్టీ వాళ్ల‌కు బాగా గుర్తే ఉంటుంది. ఆ రోజుల్లో ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ ఫోన్ చేసిన‌ప్ప‌టికీ లెక్క‌పెట్టే వాళ్లు కాదు. అదంతా ఐపీఎస్, ఐఏఎస్ ల‌కు చంద్ర‌బాబునాయుడు విశేషాధికారం ఇచ్చిన కాలం. ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీతారామాంజ‌నేయులు అంటే గ‌డ‌గ‌డ‌లాడే వాళ్లు. గుంటూరు క‌మిష‌నర్ గా ప్ర‌స్తుతం సీఎంవోను న‌డిపిస్తోన్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ఉన్నారు. అప్ప‌ట్లో గుంటూరు కార్పొరేష‌న్ చైర్మ‌న్ చుక్కా ఏసుర‌త్నంను అరెస్ట్ చేయించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అందుకు ప్ర‌తిఫ‌లంగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా ప్ర‌వీణ్ ప్ర‌కాష్ కు కీల‌క పోస్ట్ చంద్ర‌బాబు హ‌యాంలోనే ద‌క్కింది. అంతేకాదు, సీతారామాంజ‌నేయుల‌కు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా పోస్టింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. గుంటూరు టీడీపీ(TDP) మాత్రం ఆనాటి నుంచి నిర్వీర్యం అవుతూ వ‌చ్చింది.

Also Read : Jagan Tapping : ఏపీ పోలీస్ కు ఇర‌కాటం,జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి`ట్యాపింగ్ `సంక‌టం!

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా సీతారామాంజ‌నేయులు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా తెచ్చుకున్న పేరు అందిరికీ తెలిసిందే. అక్క‌డే ఒక డాక్ట‌ర్ తో ర‌హ‌స్య చాటింగ్ చేస్తూ వివాద‌స్ప‌దంగా సీతారామాంజ‌నేయులు మీడియాకు ఎక్కారు. ఆ ఎపిసోడ్ అంద‌రికీ తెలిసిందే. అదంతా వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన కుట్ర‌గా చెబుతూ ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ప్ర‌వీణ్ ప్ర‌కాష్ విజ‌య‌వాడ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా ఉండే కాలంలో అన్నీ వివాదాలే. అయిన‌ప్ప‌టికీ జాయింట్ క‌లెక్ట‌ర్ గా విశాఖ‌లో పోస్టింగ్ ఇచ్చారు. అక్క‌డ భూముల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో వివాద‌స్ప‌దునిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అయ్యారు. విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా సీతారామాంజ‌నేయులు లేడీ డాక్ట‌ర్ ఎపిసోడ్ త‌రువాత అనే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఫోక‌ల్ పోస్ట్ నుంచి ఆయ‌న్ను తెలుగుదేశం పార్టీ లీడ‌ర్లు ఆనాడు త‌ప్పించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా కృష్ణా జిల్లా టీడీపీ కూడా(Jagan IPS-IAS) నిర్వీర్యం అవుతూ ఆనాటి నుంచి వ‌చ్చింద‌ని స్థానిక నేత‌లు చెప్పుకుంటారు.

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, పోలీస్ క‌మిష‌న‌ర్ గా సీతారామాంజ‌నేయులు

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాష్ సీఎంవోలో ప్ర‌ధాన భూమిక‌ను పోషించారు. ఫ‌లితంగా చీఫ్ సెక్ర‌ట‌రీలు కూడా స్వ‌చ్చంధంగా వెళ్లిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌ల‌ను కూడా కాద‌ని సీఎంవో ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప్ర‌వీణ్ ప్ర‌కాష్ జారీ చేసిన కొన్ని ఉత్త‌ర్వులు వివాద‌స్పదం అయిన విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల మ‌ధ్య వార్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా తీర్చ‌లేక‌పోయారు. దీంతో కొన్ని నెల‌ల పాటు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ ఓఎస్డీగా వెళ్లారు. మ‌ళ్లీ తిరిగి సీఎంవోకు రావ‌డంతో వివాద‌స్ప‌ద జీవోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

ఇక సీతారామాంజ‌నేయులు ఏసీబీ చీఫ్ గా ఉన్నారు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అవినీతి వ్య‌తిరేక పోరాటం అంటూ టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌ను కూడా ఇచ్చారు. వాటి ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు ఏసీబీని యాక్టివ్ చేయ‌డానికి సీతారామాంజ‌నేయుల సామ‌ర్థ్యాన్ని ఉప‌యోగించుకోవాల‌ని భావించారు. కానీ, ఆశించిన ఫ‌లితం లేక‌పోగా, అవినీతి ఏపీలో పెచ్చ‌రిల్లింది. ఉద్యోగుల నుంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు సామాన్యుల‌ను పీల్చిపిప్పి చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌.

చంద్ర‌బాబు పాల‌న‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్మినిస్ట్రేష‌న్ మ‌ధ్య తేడా

డీజీపీగా రాజేంధ్ర‌నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత భారీగా జ‌రిగిన ఐపీఎస్ ల బ‌దిలీల్లో ఇంటిలిజెన్స్ చీఫ్ గా సీతారామాంజ‌నేయుల‌ను (Jagan IPS-IAS)నియ‌మించారు. ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ విష‌యాన్ని వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. నిఘాధిప‌తి పంపిన వీడియోను బ‌య‌ట పెట్టారు. దీంతో సీతారామాంజ‌నేయులపై ఉన్న పూర్వ‌పు వివాద‌స్ప‌ద అంశాలు బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మొత్తం మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో కీల‌కంగా ఉన్న ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌, ఐపీఎస్ సీతారామాంజ‌నేయులు వ్య‌వ‌హారాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో నిలిచిపోయాయి. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా కీల‌క టీడీపీ(TDP) లీడ‌ర్ల‌ను ఆ ఇద్ద‌రు ఆఫీస‌ర్లు ఇబ్బంది పెట్టిన విష‌యాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్మినిస్ట్రేష‌న్ మ‌ధ్య తేడా గురించి తమ్ముళ్లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CM YS Jagan: సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం