ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan IPS) దెబ్బకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు హడలిపోతున్నారు. కొందరు స్వచ్చంధంగా తప్పుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీల(Chief Secretary) నుంచి సివిల్ సర్వెంట్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను చట్టబద్ధం చేయలేక ఇబ్బంది పడుతున్నారని సచివాలయ వర్గాల్లోని టాక్. అంతేకాదు, అనేక సందర్భాల్లో ఐఏఎస్ లు హైకోర్టు నుంచి చివాట్లు తిన్నారు. వార్నింగ్ లను భరించారు. క్షమాభిక్షను కోరారు. అయినప్పటికీ ఏ మాత్రం సీఎంవో నుంచి నుంచి వస్తోన్న ఆదేశాల తీరు మారలేదని సివిల్ సర్వెంట్లు భావిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా సీఐడీ డీజీ సునీల్ కుమార్, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూలు నిలుస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan IPS)
కేంద్రహోంశాఖ నుంచి సునీల్ మీద చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి(Chief Secretary) లేఖ అందింది. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ను ఎలా డిస్మిస్ చేస్తారని ప్రశ్నిస్తూ లేఖ రాసింది. వాళ్లిద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ (Jagan IPS) వ్యవహరిస్తోన్న తీరు భిన్నంగా ఉంది. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్టు భావిస్తూ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అదే చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చురకలు వేసింది. ఈ రెండు ఎపిసోడ్ లను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎలా చట్టాన్ని, రాజ్యాంగాన్ని చులకన చేస్తుంది? అనేది అర్థమవుతోంది. రూల్ ఆఫ్ లా ఏపీలో లేదని ఎప్పుడో హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ చెప్పారు. ఆ మేరకు సుప్రీం కోర్టుకు కూడా లేఖ రాశారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసే వరకు కొన్ని ఇష్యూలు రావడం గమనార్హం.
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట ఎపిసోడ్
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి(Jagan IPS) సీఎం అయిన తరువా సీఐడీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కోకొల్లలు. వాటిలో అడ్డగోలుగా వ్యవహరించిన కేసు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట ఎపిసోడ్. ఆ కేసులో రఘురామకృష్ణమరాజు ఫోన్ తీసుకుని వేరే వ్యక్తులకు మెసేజ్ లు, కస్టడీలో త్రిబుల్ ఆర్ ను కొట్టిన వీడియోలు పంపారని సునీల్ మీద ఉంది. తాజాగా హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నసునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డీఓపీటీ శాఖకు ఫిర్యాదు వెళ్లింది. ఆ రెండు కేసులకు సంబందించి సునీల్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రహోంశాఖ ప్రశ్నిస్తూ లేఖ రాశారు. అదే సమయంలో అక్రమ అరెస్టుల నేపథ్యంలో సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తాజాగా రాసిన మరో లేఖ(Chief Secretary) పెను దుమారం రేపుతోంది.
Also Read : Jagan Sketch : కొడాలికి YCP పిడి! గుడివాడ నుంచి ఔట్? `వంగవీటి`కి వల..!
ఏపీలో జరిగిన అక్రమ అరెస్ట్ లపై గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు గతంలో ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొనిసునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదులో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వాటిని పరిశీలించిన కేంద్రహోంశాఖ తాజాగా ఏపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ (Chief Secretary)జవహర్ రెడ్డికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సీఐడీ అధికారి సునీల్ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఏపీ సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు
పలు సందర్భాల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏపీ సీఐడీ పౌరుల ఇళ్లలోకి జొరబడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దాడులు చేసింది. దీంతో భయానక వాతావరణం ఏపీలో నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 41 ఏ నోటీసు జారీ చేయకపోవడం, సీసీటీవీ కెమేరాల్లేకుండా బాధితుల్ని కస్టడీలో వేధించడం, బాధితుల కుటుంబసభ్యుల్ని బెదిరించడం, సూర్యాస్తమయం తరువాత సూర్యోదయం కంటే ముందు బాధితుల్ని అరెస్టు చేయడం వంటి ప్రాథమిక అంశాలను సునీల్ కుమార్ ఉల్లంఘిచారని లక్ష్మీ నారాయణ ఫిర్యాదులో వివరించారు. ఆయన ఫిర్యాదు పరిశీలించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవల్సిందిగా(Chief Secretary) కోరారు.
ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి..
ఇక ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి(Jagan IPS) వెంటాడుతున్నారు. ఆయన్ను డిస్మిస్ చేయాలని పలు ఆరోపణలను చేశారు. అయితే, న్యాయస్థానంలో ఏపీ సర్కార్ ఆరోపణలు ఏ మాత్రం నిలువలేదు. ఉద్యోగం నుంచి `ఏబీ`ని డిస్మిస్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని తేల్చేసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read : CM Jagan: మూడున్నరేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 5 మాత్రమే!
ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన మీద జగన్మోహ న్ రెడ్డి (Jagan IPS) చేసిన అభియోగం. దానిపై వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విధుల నుంచి వెంకటేశ్వరరావును తొలగించింది. దీంతో ఆయన న్యాయ పోరాటానికి దిగిన విషయం విదితమే. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పోస్టింగ్ ఇచ్చిన 15 రోజులకే మరోమారు సస్పెండ్ చేశారు. అవినీతి కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారన్న అభియోగాలతో ప్రభుత్వం ఆ మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. ఇలా ఆయన్ను వెంటాడుతూ సీఐడీ అడిషనల్ డీజీ గా పనిచేసిన సునీల్ కుమార్ ను మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకేసుకు వస్తోంది.
`అయ్యా ఎస్.` అనే వాళ్లకు ఒక విధంగా, `అయ్యా నో..` అనే వాళ్లకు మరో విధంగా
`అయ్యా ఎస్.` అనే వాళ్లకు ఒక విధంగా, `అయ్యా నో..` అనే వాళ్లకు మరో విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని మార్చేస్తోందని సివిల్ సర్వెంట్లలోని టాక్. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఏబీ వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్ ఎపిసోడ్ లు నిలుస్తున్నాయి. అంటే, ఏడాదిన్నర క్రితం హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ చెప్పిన మాటలు నిజమని కేంద్రహోంశాఖ ఇప్పుడిప్పుడే గమనిస్తోంది. అందుకే, ఏపీ ప్రభుత్వం మీద సీరియస్ గా ఉంది. సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని సీరియస్ గా ఆదేశించింది. ఏబీ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించడానికి లేదని తేల్చేసింది. ఈ పరిణామాన్ని జగన్మోహన్ రెడ్డి(Jagan IPS) ప్రభుత్వానికి కేంద్రహోంశాఖ ఇచ్చిన వార్నింగ్ గా సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : Jagan-KCR : తెలుగు రాజకీయ సోదర చదరంగం! పొంగులేటి,జగన్ భేటీ సీక్రెట్ ..!