Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఈ జగన్ ‘నా అన్న’ ను అవమానించాడు – పవన్ కళ్యాణ్

Chiru Jagan Pawan

Chiru Jagan Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారంలో తన దూకుడును కనపరుస్తున్నాడు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం అందుకున్న జనసేనను ఈసారి ఎలాగైనా గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోకూటమి అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటూ జగన్ ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు రాజంపేట లో వారాహీవిజయ యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు బిజెపి చీఫ్ పురందేశ్వరి సైతం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..జగన్‌ది శాడిస్టిక్ మనస్తత్వం.. కలుగులో ఎలుక లాంటివాడు.. ఎవరికి పేరు వచ్చినా తట్టుకోలేని స్వభావం. చిత్ర పరిశ్రమను సైతం రాజకీయాల్లోకి లాగాలని చూశారని ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలంటే (Tollywood Heros) కుళ్లుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారని ఆరోపించారు. టికెట్ల విషయంపై మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మషేష్ బాబు, రాజమౌళి వంటి చిత్రసీమ పెద్దలు టికెట్స్ విషయంలో జగన్ ఇంటికి వెళ్తే..ఆ సమయంలో జగన్ వారిని అవమానించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా కించపరిచి ఆనందం పొందిన వ్యక్తి జగన్. అజాత శత్రువుగా సినిమా పరిశ్రమలో ఉండే చిరంజీవి (CHiranjeevi)ని సైతం కించపరిచారన్నారు. ఇక ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే సీక్రెట్ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేశారని.. సినీ పరిశ్రమ తరుఫన చిరంజీవి మాట్లాడిన వీడియోలను రిలీజ్ చేసి ఆయనను అగౌరపరిచారన్నారు. ఈ విషయాన్ని అందరు హీరోల ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

Read Also : Sabari: రిస్క్ తీసుకుంటే జీవితంలో పైకి వస్తానని నమ్ముతా: శబరి నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల