Jagan Tadepalli House : జగన్ భయపడుతున్నాడా..? అందుకే భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడా..?

ఒక ప్రవేట్ ఏజెన్సీ ద్వారా నమ్మకమైన వ్యక్తులను గుర్తించి వీరందనినీ నియమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 11:36 PM IST

మాజీ సీఎం జగన్ తన ప్యాలెస్ (Jagan Tadepalli House) చుట్టూ భారీ ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీ (Private Security)ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చ గా మారింది. గతంలో జగన్ కోసం ఈ ప్రాంతంలో దాదాపు షిఫ్టు ల వారిగా రోజుకు 200 మంది పైగా పోలీసు సిబ్బంది ఉండేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రభుత్వ భద్రత కుదింపు చేసింది. దీంతో జగనే సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం..వచ్చి రాగానే పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం తో ప్రజలు సంతోషిస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ నివాసం ఉండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోవడం తో నగరవాసులు హమ్మయ్య అనుకుంటున్నారు. గత ఐదేళ్లు గా జగన్..అదేదో తన సొంతమైనట్లు ప్రజలకు ఎలాంటి సంబంధమే లేనట్లు 4లేన్ల రహదారిని ప్రైవేటు రోడ్డుగా మార్చుకొని ప్రజలను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు..కానీ ఇక ఆ ఇబ్బందులను కూటమి మోక్షం కలిగించింది. తాడేపల్లి ప్యాలెస్‌ ఎదుట ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలను ఎత్తేయడంతో.. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి ఆ రోడ్ల ఫై ప్రజలు ప్రయాణం చేస్తూ హమ్మయ్య అనుకుంటున్నారు.

ఈ పరిస్ధితుల్లో తన ఇళ్లు సహా పార్టీ కార్యాలయం భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీ ని జగన్ నియమించుకున్నారు. ఒక ప్రవేట్ ఏజెన్సీ ద్వారా నమ్మకమైన వ్యక్తులను గుర్తించి వీరందనినీ నియమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. 24 గంటలు, నిరంతరం కాాపలా కాసేలా అన్ని షిఫ్టులకు కలసి 200 మందిపై ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని జగన్ నియమించినట్లు తెలిసింది. ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ని నియమించుకోవడం పై సమీప పరిసరాల్లో ప్రజల్లో విస్తృత చర్చనీయాంశమైంది.

Read Also : Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!