Jagan Highlights : వ‌చ్చే 2నెల‌ల్లో కీల‌క ప‌రిణామాలు

విశాఖ నుంచి పరిపాల‌న చేయ‌డానికి జ‌గన్మోహ‌న్ రెడ్డి(Jagan Highlights)ఏర్పాట్లు చేసుకుంటున్నారు.క్యాంప్ ఆఫీస్ నిర్మాణాల ప‌నులు జ‌రుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 04:17 PM IST

విశాఖ నుంచి పరిపాల‌న చేయ‌డానికి సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి(Jagan Highlights)ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేగంగా క్యాంప్ ఆఫీస్ నిర్మాణాల ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల తాడేప‌ల్లి నుంచి విశాఖ వెళ్ల‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేకాదు, అనుమతులు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు నిర్మిస్తామ‌ని మంగ‌ళ‌వారం ఆర్థిక మంత్రి బుగ్జ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌క‌టించారు. అంటే, మూడు రాజ‌ధానుల అంశాన్ని ఎన్నిక‌ల నాటికి తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. ప్రాంతీయ విభేదాల‌తో ఓట్ల‌ను పొంద‌డానికి వైసీపీ ఎత్తుగ‌డ వేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

విశాఖ నుంచి పరిపాల‌న చేయ‌డానికి సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి(Jagan Highlights)

విప‌క్షాలు తేరుకునేలోగా ఎన్నిక‌ల‌ను ముగించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, ఆయ‌న అనుకున్న విధంగా మూడు రాజ‌ధానులకు రాజ‌ముద్ర వేయాల‌ని చూస్తున్నారు. కానీ, సుప్రీం కోర్టులో అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం ఉంది. డిసెంబ‌ర్లో వాద‌న‌ల‌ను విన‌డానికి సుప్రీం టైమ్ ఫిక్స్ చేసింది. ఆ లోపు న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా క్యాంప్ ఆఫీస్ ను త‌ర‌లించుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రంగం సిద్దం చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఎక్క‌డైనా పెట్టుకునే వెసుల‌బాటు ఉంది. అందుకే, ఆ దిశ‌గా ఆయ‌న (Jagan Highlights)  అడుగులు వేస్తున్నారు.

కర్నూలులో హైకోర్టు నిర్మిస్తామ‌ని బుగ్జ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి

వ‌చ్చే నెల క్యాంప్ ఆఫీస్ ను విశాఖ త‌ర‌లించిన త‌రువాత ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకుని, అక్టోబ‌ర్ లో ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న చ‌ర్చ‌. ఆయ‌న ముందస్తు ఎన్నిక‌ల గురించి స్ప‌ష్ట‌త ఇస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మూడు మార్గాల ద్వారా ఎమ్మెల్యేల గ్రాఫ్ ను సేక‌రించారు. ఐ ప్యాక్ టీమ్ ఒక స‌ర్వేను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చింది. రాష్ట్ర నిఘా వ‌ర్గాల ద్వారా ఒక స‌ర్వే. పార్టీలోని న‌మ్మ‌క‌స్తులైన సీనియ‌ర్ల ఆధ్వ‌ర్యంలో మ‌రో స‌ర్వే చేయించార‌ని వినికిడి. ఆ మూడు స‌ర్వేల ఆధారంగా ద‌స‌రా త‌రువాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కో ఆర్డినేట‌ర్ల‌తో సీరియ‌స్ మీటింగ్ పెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ మీటింగ్ లో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని (Jagan Highlights) ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

అక్టోబ‌ర్ లో ముందస్తు ఎన్నిక‌ల గురించి స్ప‌ష్ట‌త

అక్టోబ‌ర్ నెల‌లో అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నార‌ని స‌మాచారం. ఆ స‌మావేశాల్లోనే స‌భ‌ను ర‌ద్దు చేస్తార‌ని తెలుస్తోంది. అంత‌కంటే, ముందుగా స‌ర్వేల ద్వారా సేక‌రించిన ఫ‌లితాల ఆధారంగా ఎమ్మెల్యే గ్రాఫ్ ను నిర్థారించ‌నున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప‌రిస్థితిని అంశాల వారీగా షీట్ల‌ను ఎమ్మెల్యేల‌కు అందించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి నేరుగా సంబంధిత ఎమ్మెల్యేకు షీట్  (Jagan Highlights)  అందిస్తార‌ని తెలుస్తోంది. ఆ గ్రాఫ్ ప్ర‌కారం టిక్కెట్ వ‌స్తుందా? రాదా? అనేది వాళ్లే తెలుకుంటార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Jagan CPS : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స‌వారీ

స‌మీప భ‌విష్య‌త్ లోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, చ‌త్తీస్ గ‌ఢ్‌, మిజోరాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌బోతున్నాయి. వాటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా జ‌ర‌గ‌డానిక వీలుంద‌ని చాలా కాలంగా వినిపిస్తోంది. ముందస్తుకు వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లి సానుకూల ప‌రిస్థితుల‌ను క్రోడీక‌రించుకున్నార‌ని వినికిడి. అంతేకాదు, ఓట‌ర్ల జాబితాకు తుది రూపు కూడా ఎన్నికల క‌మిష‌న్ ఈనెలాఖ‌రు నాటికి ఇవ్వ‌నుంది. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, ముందస్తు ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్ల‌బోతున్నార‌ని ప్రత్య‌ర్థి పార్టీలు అనుమానిస్తున్నాయి. అందుకే, విప‌క్షాలు కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతూ స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్ షోల‌ను పెడుతూ ప్ర‌జ‌ల్లోకి చురుగ్గా వెళుతున్నారు.

Also Read : YCP Luck : జ‌గ‌న్ కు మేలుచేసేలా ప‌వ‌నిజం

వ‌చ్చే రెండు నెల‌ల్లో కీల‌క ప‌రిణామాలు ఏపీలో చోటుచేసుకోబోతున్నాయి. విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న ప్రారంభించ‌డం ఒక‌టైతే, అసెంబ్లీ స‌మావేశాలు, ముంద‌స్తుకు వెళ్ల‌డం మ‌రో అంశంగా క‌నిపిస్తోంది. క‌ర్నూలులో హైకోర్టు హామీ బీజేపీ కూడా ఇచ్చింది. దానికి ఆ పార్టీ క‌ట్టుబ‌డి ఉంది. అందుకే, ఢిల్లీ వేదిక‌గా ఆ ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ చేస్తోంది. అందుకే, అనుమ‌తులు వ‌చ్చిన త‌రువాత హైకోర్టు, లా యూనివ‌ర్సిటీల‌ను రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామ‌ని తాజాగా బుగ్గ‌న ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం.