Site icon HashtagU Telugu

Nara Lokesh : హైద‌రాబాద్ ఆస్తుల కోసం ఏపీపై జ‌గ‌న్ కుట్ర‌: లోకేష్‌

Lokesh Padayatra

Lokesh Padayatra

ఏపీ రాష్ట్రాన్ని ఉద్దేశ పూర్వ‌కంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాశ‌నం చేస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఆరోపించారు. అమ‌రావ‌తి ప్రాజెక్టును కావాల‌ని కిల్ చేశాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. హైద‌రాబాద్ లోని ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి జ‌గ‌న్ ఏపీపై కుట్ర ప‌న్నాడ‌ని ఆరోపించారు. భ‌విష్య‌త్ లోనూ ఆయ‌న కుట్ర‌లు ఆగ‌వ‌ని అన్నారు. నాన్ స్టాప్ గా కుట్ర‌లు ప‌న్నుతూ హైద‌రాబాద్ ఆస్తులను కాపాడుకుంటున్నాడ‌ని విమ‌ర్శించారు.

అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజధాని ప్రాంతాన్ని కేవలం శ్మశానవాటిక (శ్మశాన వాటిక)గా పిలిచిన జగన్ రెడ్డి అమరావతి భూములను ఎకరం రూ.10 కోట్లకు ఎలా అమ్ముతారని లోకేష్ ప్రశ్నించారు. ఏపీ రాజధానిపై అధికార వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేసిన తీరును లోకేష్ గుర్తు చేశారు.

అమరావతి భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని, రాజధాని భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్న జ‌గ‌న్ ఇప్పుడు దాన్ని మ‌రింత కిల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. పార్టీ నేతలు రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ అన్నారు. ఇప్పుడు అదే వైఎస్సార్‌సీపీ నేతలు అమరావతి భూములను అధిక ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి, రాజధానికి వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుతంత్రాలకు అంతులేకుండా ఉంద‌ని అన్నారు.

Exit mobile version