Site icon HashtagU Telugu

Jagan : జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు

Schemes distributed to beneficiaries today

Schemes distributed to beneficiaries today

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి వివేకా హత్య కేసు (Viveka Murder Case) సంచలనంగా మారింది. ఈ కేసులో సాక్షుల మరణాల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో నేరస్థులకు చోటు కల్పించడం, రాజకీయాలను అక్రమ మార్గంలో మలచడం జగన్ (Jagan) పాలనలో ప్రారంభమైందని ఆరోపించారు. వివేకా హత్య కేసు వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి తీరును అర్థం చేసుకోవాలని సూచించారు.

స్వలబ్ధి కోసం నేరపూరిత రాజకీయాలు

జగన్ మోహన్ రెడ్డి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో నేరపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ ముసుగులో నేరస్థులకు సహాయపడే విధంగా ఆయన పాలన సాగిందని మండిపడ్డారు. వివేకా హత్యను ప్రారంభంలో గుండెపోటుగా చూపే ప్రయత్నం, తర్వాత హత్యను గొడ్డలి వేటుగా పేర్కొనడం, చివరికి తనపైనే ఆరోపణలు చేయడం పచ్చి రాజకీయ డ్రామా అని పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో అనేక అనుమానాలు

వివేకా హత్య కేసులో అనేక అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. సాక్షులను ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయించడం, నిజాలు వెలుగులోకి రాకుండా కుట్రలు చేయడం జగన్ ప్రభుత్వం ప్రోత్సహించిన విధానమేనని అన్నారు. అంతేకాకుండా, వివేకా కుటుంబంలోని వ్యక్తులను నిందితులుగా మార్చే ప్రయత్నం చేయడం అన్యాయమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, రాజకీయాల పేరుతో జరుగుతున్న ఈ అక్రమాలను నిలువరించేందుకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

RT76 : రవితేజకు జోడిగా ఆ ఇద్దరు భామలు