వైస్ జగన్ (YS Jagan)..వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడని..రాజకీయాల్లో తండ్రి పేరును నిలబడతారని..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని అంత భావించారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారని..ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిపించారు. కానీ జగన్ ను గెలిపించి ఎంత పెద్ద తప్పు చేసామో అనేది తొందరలోనే పసిగట్టారు. కానీ ఏంచేయలేని పరిస్థితి. జగన్ ఏంచేస్తే అది చూసుకుంటూ పోయారు.
టైం చూసుకొని అడ్రెస్ లేకుండా చేసారు. ప్రజలు ఎందుకు తమను ఓడగొట్టారో..కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంతగా చేసారని ఇప్పటికి కూడా జగన్ ఆలోచించడం లేదు. తాను చేసేదే కరెక్ట్..అన్నట్లు ఇప్పటికి అలాగే ప్రవర్తిస్తున్నాడు. తన హయాంలో ఏ తప్పులు జరిగాయి..? ఎలా జరిగాయి..? అందులో తన పాత్ర ఎంత ఉంది..? తన పార్టీ నేతల తీరు ఎలా ఉంది..? ప్రజలు ఎందుకు ఛీ కొట్టారు..? ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమిచేస్తుంది..? ఇలాంటి మార్పులు చేస్తుంది..? ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇవన్నీ గ్రహించడం మానేసి..ఎంతసేపూ తమదే కరెక్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. జగన్ చేస్తున్న తీరు..తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను మరింత దూరం చేస్తున్నాయి. జగన్ వాస్తవ ప్రపంచంలోకి రాడా.? అసలు ఆ ఆలోచనా కూడా చేస్తున్నట్లే లేదే అని ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా జగన్ సమావేశాలకు దూరంగా ఉన్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. సభా వ్యవహారాల విషయంలో కోర్టు చెబితే తనకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేయాల్సిందేనని.. అనర్హతా వేటు వేస్తే కోర్టులకు వెళ్తామని ఆయన అమాయకంగా చెబుతున్నారు. రాజ్యాంగం గురించి ..సభా హక్కుల గురించి ఇంత కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడుతారో వైసీపీలోని జూనియర్ నేతలకూ అర్థం కావడం లేదు. సీఎంగా పని చేసిన వ్యక్తికి ఉన్న అవగాహన ఇదేనా అని ఆశ్చర్యపోతున్నారు.
భారత రాజ్యాంగం శాసనసభకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సభా నిర్వహణ వరకూ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. సభా నియమాలు, సంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. ఫలానా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. ఫలానా వ్యక్తిని స్పీకర్ ను చేయాలి.. సభలో ఫలానా విధంగా జరిగింది కాబట్టి మేము చెప్పినట్లుగా చేయాలి అని కోర్టులు ఆదేశించలేవు. ఆ అధికారం వారికి లేదు. సభా వ్యవహారాల్లో పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుంది. జగన్ రెడ్డికి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవడం ఏంటి..? అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ ఎప్పుడు మారతారో..రూల్స్ ఎప్పుడు పాటిస్తారో అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
Read Also : Team India World Record: టీమిండియా పేరిట ప్రపంచ రికార్డు.. ఏంటంటే..?