Site icon HashtagU Telugu

AP Assembly 2024 : అసెంబ్లీ గేటు వద్ద జగన్ కు చేదు అనుభవం..

Jagan Mavayya

Jagan Mavayya

ఏపీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. రేపు ఉదయం 10.30గంటలకు సభ పున:ప్రారంభం కానుంది. మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.

ఇదిలా ఉంటె వైసీపీ అధినేత , పులివెందుల ఎమ్మెల్యే జగన్ (Jagan) సైతం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. అంతక ముందు అసెంబ్లీ గేటు వద్ద జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ ని కొందరు ఆకతాయిలు ఫాలో అవుతూ కామెంట్ చేశారు. “జగన్ మామయ్య.. జగన్ మామయ్య” అంటూ కేకలు వేస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొంత అసహనం వ్యక్తం చేసారు. ఇక జగన్ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద నుండి కాకుండా అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణానికి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రూటు మార్చి అమరావతి రైతుల శిబిరం వైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జగన్ సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్‌లోనే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి, ప్రొటెం స్పీకర్​కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్​కు వెళ్లిపోయారు.

ఇక మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ నేతలకు చంద్రబాబు సూచించారు. జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని మ్మెల్యేలకు సీఎం సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని TDP సహచరులకు బాబు తెలిపారు.

Read Also : Summer Solstice 2024: జూన్ 21న పగలు ఎక్కువ సమయం, రాత్రి తక్కువ సమయం