ఏప్రిల్ 3వ తేదీ ఏం జరగనుంది? (Jagan graph) వైసీపీ శాశ్యత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఆ 20 మంది వరకే పరిమితమా? 40 మందికి ఉద్వాసన(YCP listout) చెప్పబోతున్నారా? మరో ఛాన్స్ కోసం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఏ ఇద్దరు వైసీపీ లీడర్లు కలిసుకున్నప్పటికీ చర్చించుకుంటోన్న అంశం. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జి, సమన్వయకర్తలతో కీలక మీటింగ్ తాడేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 3వ తేదీన జరగనుంది. ఆ రోజున కనీసం 20 మందికి టిక్కెట్ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి చెబుతారని వినిపిస్తోంది.
ఏప్రిల్ 3వ తేదీ ఏం జరగనుంది? (Jagan graph)
పలు రకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్వేలు(Jagan graph) చేయించుకుంటారు. వాటి ఆధారంగా టిక్కెట్లను ఇస్తారు. 2019 ఎన్నికల్లో సర్వేలను ఫాలో కావడం ద్వారా అనూహ్య ఫలితాలను సాధించారు. ఎక్కడా రాజీపడకుండా గెలిచే వాళ్లకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన డైరెక్షన్ మేరకు మాత్రమే టిక్కెట్లు కేటాయించారు. సీన్ కట్ చేస్తే 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. సీఎం అయిన తరువాత ఏమి చేయాలి? అనేది కూడా అప్పుడే డిసైడ్ అయ్యారట. ఆ మేరకు బ్లూ ప్రింట్ ప్రశాంత్ కిషోర్ అప్పుడే ఇచ్చారని తెలుస్తోంది. దాన్నే ఇప్పటి వరకు ఆయన అమలు చేస్తున్నారని సమాచారం. ఆ క్రమంలోనే వాల్మీకులను ఎస్టీల్లోనూ, దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన డైరెక్షన్
తాజాగా ఐ ప్యాక్ చేసిన సర్వేల (Jagan graph) ఆధారంగా రెండు రివ్యూ మీటింగ్ లను జగన్మోహన్ రెడ్డి చేశారు. వాటి ఆధారంగా గ్రాఫ్ లను డిసైడ్ చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన సమీక్షలో కనీసం 50 మంది గ్రాఫ్ అప్ టూ మార్క్ లేదని తేల్చేశారు. వాళ్లకు కొంత టైమ్ ఇస్తూ గ్రాఫ్ ను పెంచుకోవాలని సూచించారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ సందర్భంగా పలు చోట్ల ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. కొందరు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆ జాబితాను కూడా రివ్యూ మీటింగ్ లో ప్రస్తావించారు. సీఎంగా తనకు ఉండే క్రేజ్ మినహా కొందరు ఎమ్మెల్యేలు బాగా వెనుకబడ్డారని సూచాయగా తెలిపారు. అప్పటి నుంచి గ్రాఫ్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో నడుస్తోంది. తాజాగా రెండోసారి రివ్యూ మీటింగ్ నిర్వహించడం ద్వారా 30 మందిని అప్ టూ మార్క్(YCP listout) లేరని గుర్తించినట్టు తెలుస్తోంది.
Also Read : YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జగన్ రీ థింక్!
గ్రాఫ్ ను బేస్ చేసుకుని ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇచ్చే అంశంపై జగన్మోహన్ రెడ్డి ఫైనల్ (Jagan graph) నిర్ణయానికి రానున్నారు. అంతేకాదు, ముందుగా సిట్టింగ్ లకు సంకేతాలు ఇవ్వనున్నారు. ఒక వేళ ఇతర పార్టీలకు వెళ్లే వాళ్లుంటే, వెళ్లొచ్చని తెగేసి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలోనే ఏప్పిల్ 3వ తేదీన రివ్యూ మీటింగ్ ను పెట్టబోతున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అందుకే, చాలా మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు బయటకు వచ్చేశారు. ఆ జాబితా ఇంకా 20 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం కనీసం 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాన్ని చూస్తే ఎంత మందికి జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 3వ తేదీన జలక్ (YCP listout) ఇస్తారు? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.
Also Read : YCP-CBN : జగన్ `స్వర`లహరి, టీడీపీ బహుపరాక్!