AP Assembly : నేడు ఏపీ అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న 9 కీలక బిల్లులు ఇవే..

నేడు అసెంబ్లీలో కీలక 9 బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 11:18 AM IST

గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మూడో రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో స‌భ ప్రారంభ‌మైంది. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Speaker Tammineni Seetaram) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయంపై వైసిపి సభ్యులు పుప్పాల శ్రీనివాసరావు, కాసు మహేష్ రెడ్డి, టిజేఆర్ సుధకర్ బాబులు ప్రశ్న అడుగగా.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

కాగా నేడు అసెంబ్లీలో కీలక 9 బిల్లులకు ప్రభుత్వం (YCP Govt To Introduce 9 Key Bills In AP Assembly) ఆమోదం తెలుపనుంది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లు, ఏపీ రవాణా వాహనాలు పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది అసెంబ్లీ. అలాగే, బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది అసెంబ్లీ. దాంతో పాటు అసెంబ్లీలో మహిళా సాధికారత, అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వే పై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

మరోపక్క అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపి శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామమని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పుకొచ్చారు.

Read Also : Yoga Robot – Tesla : ఈ రోబో యోగా మాస్టర్.. టెక్నాలజీలో టెస్లా విప్లవం