Amaravati Issue: అమరావతిపై జగన్ సర్కార్ ఆప్షన్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ సర్కార్ ఇప్పుడు డైలమాలో పడింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలనీ, భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 08:30 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ సర్కార్ ఇప్పుడు డైలమాలో పడింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలనీ, భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని
ఆదేశించింది. ఎప్పటికప్పుడు తమకు నివేదిక ఇవ్వాలనీ కూడా ఏ.పి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు, టీడీపీ హైకోర్టు తీర్పును స్వాగతించాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి నుండి అమరావతిని రాజధానిగా కొనసాగించడం ఇష్టంలేని జగన్ సర్కారుకు హైకోర్టు తీర్పు సహజంగానే రుచించలేదు. కోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత న్యాయ పరంగానే ముందుకు వెళ్ళాలని భావిస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి.ఒకటి కోర్టు తీర్పును అమలు చేయడం….లేదా రెండు సుప్రీం కోర్టును ఆశ్రయించడం.

కోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే చెప్పాలి. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే మంత్రి బొత్స స్పష్టం చేశారు. దీనికి తోడు అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు ఆర్థిక భారం మోసే పరిస్థితి లేదని తేల్చేశారు. ఇదే కారణంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సుప్రీం కోర్టును ఆశ్రయించడం కంటే హై కోర్టు లోనే మరో పిటిషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోర్టు తీర్పుపై సీఎం జగన్ మంత్రులు, సలహాదారులు మరియు మాజీ న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. సమాచారం.

కోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స ఈ తీర్పుపై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదని తాము భావిస్తున్నామనట్టు చెప్పారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన గుర్తుచేశారు. అన్నింటికి మించి చట్టాలు చేసే అధికారం ప్రభత్వానికి లేదన్న కోర్టు వ్యాఖ్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ధర్మాన సీఎం జగన్ కు లేఖ రాశారు. దీంతో ఇవాళ్టి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపైనే అందరి దృష్టి ఉంది. కాగా సి.ఆర్.డి.ఏ చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని, రాజధాని విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామనీ మంత్రులు చెబుతుండగా…ఈ సారి పూర్తి న్యాయ నిపుణుల అభిప్రాయంతోనే ముందుకెళ్లాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.