Site icon HashtagU Telugu

YS Sharmila : జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంది – షర్మిల

Sharmila Jagan

Sharmila Jagan

ఏపీలో ఎన్నికల (AP Elections) సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన దూకుడు ను రోజు రోజుకు మరింత పెంచుతుంది. ముఖ్యంగా తన అన్న జగన్ (Jagan) ను టార్గెట్ గా చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ సర్కార్ కు వరుస ప్రశ్నలు సంధించింది. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం జగన్ మోసం చేసాడు. ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని… జాబు రావాలంటే జగన్ కావాలని ఘరానా మోసానికి తెరలేపారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని.. మెగా డీఎస్సీ అని..ఏపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారని ఫైర్ అయ్యారు. మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసారు

ఇక మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్ప.. గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా?’’ అని ప్రశ్నించారు. నేటికీ శాఖల పరిధిలో 2.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read Also : Tattoos : టాటూలను 15 రోజుల్లోగా తొలగించాలి..పోలీసులకు ఆదేశం