AP Cancer Hospitals: ఏపీలో కొత్త‌గా 3 క్యాన్సర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయ‌నున్న జ‌గ‌న్ స‌ర్కార్..!

  • Written By:
  • Publish Date - March 12, 2022 / 10:16 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాజాగా ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయుడు శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో క్యాన్స‌ర్ చికిత్స, స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నోరి దత్తాత్రేయుడికి జగన్ సూచించారు. తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ నిర్మాణం, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌ల‌ను నోరి ద‌త్తాత్రేయుడు నిన్న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేశారు.

ఈ నేప‌ధ్యంలో క్యాన్సర్ చికిత్స అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని నోరి ద‌త్తాత్రేయుడు తెలిపారు. క్యాన్స‌ర్ చికిత్స కోసం ఆంధ్ర‌ రాష్ట్ర ప్ర‌జ‌లు, ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఏపీలోనే చికిత్స చేయించుకునేలా ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. అందుకు స‌హ‌క‌రించాల‌ని ఇప్ప‌టికే నోరి ద‌త్తాత్రేయుడిని జ‌గ‌న్ కోరంగా, ఈ విషయంలో తాను ఏపీకి స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మ‌ని నోది ద‌త్తాత్రేయుడు తెలిపారు. ఈ క్ర‌మంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయ‌నున్న ఆసుప‌త్రుల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు నోరీ అంద‌జేశారు.

ఇక నోదీ ద‌త్తాత్రేయుడు అంద‌జేసిన డీపీఆర్‌ల ప్ర‌కారం గుంటూరు- విజ‌య‌వాడ‌ల మ‌ధ్య‌, తిరుప‌తి, విశాఖప‌ట్నంలోమూడు అత్యాధునిక కేన్స‌ర్ ఆసుప‌త్రుల‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఈ క్ర‌మంలో ముఖ్యంగా తిరుప‌తిలో ఏర్పాటు కానున్న ఆసుప‌త్రిలో ప్ర‌త్యేకంగా చిన్న పిల్ల‌ల‌కు క్యాన్స‌ర్ వైద్యం అందించే ఏర్పాట్లు చేయ‌నున్నారని సమాచారం. ఈ ఆసుప‌త్రుల నిర్మాణం పూర్తయితే ఆంధ్ర ప్ర‌జ‌లు క్యాన్సర్ చికిత్స కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్ళ‌కుండా, అతి త‌క్కువ ధ‌ర‌కే సొంత రాష్ట్రంలోనే క్యాన్స‌ర్ చికిత్స చేయించుకునే అవ‌కాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మంచి శుభ‌వార్త చెప్పింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.