Site icon HashtagU Telugu

Skoch Group Governance Report Card: జ‌గ‌న్ నెంబ‌ర్-1 సీఎం

Ys Jagan Governance Report Card

Ys Jagan Governance Report Card

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దేశంలోనే మొద‌టి ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో 2021వ సంవ‌త్స‌రానికి జ‌గ‌న్ స‌ర్కార్ ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా స్కాచ్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాష్ట్రంగా ఏపీ మొద‌టి స్థానంలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా రెండు ప‌ర్యాయాలు నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ను సాధించ‌లేదు.

ఏపీలో పోలీసు/భద్రత, వ్యవసాయం, ఈ- గవర్నెన్స్, గ్రామీణాభివృద్ది వంటి ప‌లు అంశాలు జగన్ ప్ర‌భుత్వాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా నిల‌బెట్టిందని స్కాచ్ గ్రూపు రిపోర్ట్ కార్డు తెలిపింది. జిల్లా పాలనా యంత్రాంగం నిర్వహణ కూడా మెరుగ్గా ఉండడం ఉత్తమ ర్యాంకుకు తోడ్పడింది. ఇక రవాణా విషయంలో మొద‌టి స్థానంలో పశ్చిమ బెంగాల్, రెండో స్థానంలో మహారాష్ట్ర, ఆ తర్వాత మూడో స్థానంలో ఏపీ నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేసే ప్రాజెక్టుల పురోగతి, ఫలితాలను విశ్లేషించిన అనంతరం స్కాచ్ గ్రూపు ఈ ర్యాంకులను కేటాయిస్తుంది.

ఇక స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు 2020లో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ సర్కార్, 2021 నివేదిక‌లో రెండో స్థానానికి ఎగబాకింది. అలాగే 2020లో ఎనిమిదో స్థానంలో ఉన్న‌ ఒడిశా సర్కార్, ఈ విడత మూడో స్థానానికి పుంజుకుంది. ఇక స్టార్ ఫెర్ఫామ‌ర్‌గా ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉండ‌గా, తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఫెర్ఫామ‌ర్‌గా, రాష్ట్రాల ప‌నితీరు ఆధారంగా స్కాచ్ గ్రూపు వర్గీకరించించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన వివ‌రాలు రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఏది ఏమైనా వ‌రుస‌గా రెండోసారి ఆంధ్ర రాష్ట్రంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం, ఏపీ ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చిన‌ట్టే అని, జ‌గ‌నే నెంబ‌ర్ వ‌న్ సీఎం స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.