CAG Report: టీడీపీకి దొరికిన‌ అస్త్రం.. వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన కాగ్ రిపోర్ట్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజ‌గా కాగ్‌ నివేదిక స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్ల‌డించిది.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 01:33 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజ‌గా కాగ్‌ నివేదిక స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్ల‌డించిది. దీంతో రాష్ట్ర‌ ఆర్ధిక పరిస్థితిపై మరోసారి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశంపార్టీ టార్గెట్ చేసింది. కాగ్ ఇచ్చిన రిపోట్ ఆధారంగా జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ నాయ‌కులు ఎటాక్ మొదలుపెట్టారు.

ఈ నేప‌ధ్యంలో తెలుగుదేశంపార్టీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. కాగ్ రిపోర్ట్ నేప‌ధ్యంలో ఏపీ ప్ర‌భుత్వం చేసిన నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్ము, వైసీపీ నేత‌ల జేబుల్లోకి వెళ్లాయ‌ని టీడీపీ త‌మ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం 1.78 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు పెడితే, అందులో 48వే ల కోట్ల‌కు సంబంధించిన లెక్కలు మిస్ అయ్యాయ‌ని కాగ్ రిపోర్ట్ చేబుతున్న నేప‌ధ్యంలో, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు చెప్ప‌లేక‌పోతుంద‌ని కొంద‌రు తెలుగుదేశం త‌మ్ముళ్ళు ప్ర‌శ్చిస్తున్నారు.

ఇక కాగ్ రిపోర్ట్ బ‌య‌ట‌కు రాగానే 48వేల కోట్ల ఖ‌ర్చుకు సంబంధించి, స్పెష‌ల్ బిల్లుల పేరుతో ఖ‌ర్చు పెట్టామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని, అస‌లు ట్రెజ‌రీ కోడ్‌లో స్పెష‌ల్ బిల్లు అనేది లేద‌ని మ‌రో షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిందిబ టీడీపీ. దీంతో రాష్ట్రంలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జ‌రుగుతుంద‌ని, వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో కేంద్రం ఆర్టిక‌ల్ 360ని అమ‌లు చేయాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా చివ‌రి రోజున స‌భ‌లో కాగ్ రిపోర్ట్ ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన  48 వేల కోట్లకి బిల్స్ లేవని కాగ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. అంతే కాకుండా అదనంగా చేసిన 88 వేల కోట్ల అప్పును కూడా బడ్జెట్‌లో చూపించలేదని కాగ్ స్పష్టం చేసింది. ఈ క్ర‌మంలో ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలులేద‌ని అయితే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం శాస‌న‌స‌భ‌ ఆమోదం లేకుండానే అడ్డదిడ్డంగా ఖర్చు చేసేసిందని కాగ్ వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో బిల్లులు లేకుండా చెల్లించిన మొత్తాలకు స్పెషల్ బిల్లులుగా ఏపీ ప్రభుత్వం పేర్కొన‌గా, దీన్ని కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం పై టీడీపీ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. దీంతో సీఎం జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌లు డిఫెన్స్‌లో ప‌డ‌గా, టీడీపీకి తొలిసారి అస్త్రం దొరికింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.