Jagan Govt and 3 Capitals:3 రాజ‌ధానుల కోసం `సుప్రీం`కు జ‌గ‌న్ స‌ర్కార్‌

మూడు రాజ‌ధానుల అమ‌లు కోసం సుప్రీం కోర్టును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 01:42 PM IST

మూడు రాజ‌ధానుల అమ‌లు కోసం సుప్రీం కోర్టును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ తెలిపింది. అంతేకాదు, సీఆర్డీయే చ‌ట్టం ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని హైకోర్టు సూచించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ అసెంబ్లీ అధికారాల‌ను ప్ర‌శ్నించ‌డ‌మేనంటూ లాజిక్ తీసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల‌ని కోరుతూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును కోర‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్ర‌భుత్వం తాజాగా స‌వాల్ చేసింది. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే, శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పిటిష‌న్ లో పేర్కొంది.అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులను అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు పిటిషన్‌లో ప్రభుత్వం పొందుప‌రిచింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ తెలిపింది.

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపర్చారు. కానీ, తాజాగా మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఎలాగైనా రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో వేచి చూడాలి.