Jagan Governament : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ విజ‌యం!ఒకే ఒక్క‌డు సూర్య‌నారాయ‌ణ!!

ఏపీ ప్ర‌భుత్వ(Jagan Governament) ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. ఆయ‌న కోసం ఏపీ పోలీసులు అన్వేషిస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 10, 2023 / 05:34 PM IST

ఏపీ ప్ర‌భుత్వ(Jagan Governament) ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. ఆయ‌న కోసం ఏపీ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆయ‌న చేసిన నేరం ఏమిటో తెలుసా? ప్ర‌తి నెలా జీతాలు టైమ్ కు ఇవ్వడంలేద‌ని సంఘం నేత‌ల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌డం. ఆ రోజు నుంచి ఆయ‌న మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ క‌న్నేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్ని ర‌ద్దు ఎందుకు చేయ‌కూడ‌దు? అనే ప్ర‌శ్న మొద‌ల‌యింది. అదే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు చేస్తోంది.

ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం ప‌రారీ (Jagan Governament)

ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల(AP employees) సంఘం నేత సూర్య‌నార‌య‌ణ టీడీపీ సానుభూతిప‌రుడని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్(Jagan Governament) వ‌ద్ద ఉన్న స‌మాచారం. గ‌తంలో ఉద్యోగ సంఘాల‌ను న‌డిపించిన ప‌ర్చూరి అశోక్ బాబుకు అత్యంత స‌న్నిహితుడ‌ని న‌మ్ముతోంది. అందుకే, సూర్య‌నారాయ‌ణ(Suryanarayana) మీద నిఘా పెట్టింది. ఆ సంఘాన్ని ర‌ద్దు చేయ‌డంపై హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు స‌ర్కార్ పోరాడుతోంది. న్యాయ‌స్థానాల్లో ఒక వైపు పోరాడుతూనే మ‌రో వైపు సూర్య‌నార‌య‌ణ మీద ప‌లు అభియోగాలు మోప‌డం ద్వారా పోలీస్ విచార‌ణ‌కు స‌ర్కార్ ఉప‌క్ర‌మించింది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్య‌య సంఘాల‌న్నీ ఐక్యంగా ఉండేది. ఫ‌లితంగా సీపీఎస్ ర‌ద్దు డిమాండ్ చేస్తూ చేసిన ఛ‌లో విజ‌య‌వాడ అనూహ్యంగా విజ‌య‌వంతం అయింది. ఆ రోజున ఉద్యోగుల పోరాటాన్ని చూసి మ‌రోసారి పున‌రావృతం కాకుండా ఉండేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ స్కెచ్ వేసింది.

సూర్య‌నార‌య‌ణ మీద ప‌లు అభియోగాలు మోప‌డం ద్వారా పోలీస్ విచార‌ణ‌

ప్ర‌భుత్వ ఎన్డీవో, నాన్ ఎన్జీవో, రెవెన్యూ, గ్రామ ఉద్యోగ సంఘాలు ఉండేవి. వీటికి తోడుగా ఉపాధ్యాయ సంఘాలు (AP employees)కూడా అప్ప‌ట్లో చేయి క‌లిపాయి. దీంతో ప్ర‌భుత్వాన్ని సైతం వ‌ణికించాయి. గ‌తంలోనూ చంద్ర‌బాబు స‌ర్కార్ ను ఆడించాయి. వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు, రెండు హెచ్ ఆర్ ఏలు, ఉంటానికి తిన‌డానికి ఉచితంగా సౌక‌ర్యాలు, హైద‌రాబాద్ నుంచి అమరావ‌తి చేరుకోవ‌డానికి ఉచిత ప్ర‌యాణం, ప్ర‌త్యేక బ‌స్సులు, రైలు ఇలా ఎన్నో కోర్కెల‌ను చంద్ర‌బాబు తీర్చారు. అయిన‌ప్ప‌టికీ అశోక్ బాబు(Ashok babu) ఆధ్వ‌ర్యంలో ఉద్యోగులు మ‌రిన్ని కోర్కెల‌ను కోరారు. ఉద్య‌మానికి అప్ప‌ట్లో కార్యాచ‌ర‌ణ‌కు దిగుతోన్న స‌మ‌యంలో అశోక్ బాబును అప్పుడున్న చంద్ర‌బాబు స‌ర్కార్ అక్కున చేర్చుకుంది. ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వానికి సానుకూలంగా మ‌ల‌చ‌డానికి ఉప‌యోగించుకుంద‌న్న అప‌వాదును ఎదుర్కొంది. దానికి బ‌లాన్ని ఇచ్చేలా అశోక్ బాబు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత ఎమ్మెల్సీగా టీడీపీ త‌ర‌పున నామినేట్ కావ‌డం గ‌మ‌నార్హం.

సంఘాల నాయ‌కులంద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద పొగ‌డ్త‌ల వ‌ర్షం

ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌మానాలో (Jagan Governament)ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం మిన‌హా మిగిలిన సంఘాల‌న్నీ ప్ర‌భుత్వానికి సానుకూలంగా మారాయి. ఇటీవ‌ల క్యాబినెట్ చేసిన తీర్మానాల‌కు ప్ర‌తిగా పాలాభిషేకం చేయ‌డానికి ఆయా సంఘాల నేత‌లు పోటీప‌డుతున్నారు. 12వ పీఆర్సీ వేయ‌డం, హెచ్ ఆర్ ఏ 16శాతానికి పెంచ‌డం త‌దిత‌ర 32 డిమాండ్ల‌ను నెరవేర్చినందుకు అభినంద‌న స‌భ‌ల‌ను పెట్ట‌డానికి ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని పోటీప‌డి బండి శ్రీనివాస‌రావు, ఉద్యోగుల జేఏసీ అమ‌రావ‌తి సంఘం నేత బొప్ప‌న వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌శ‌సిస్తున్నారు. సంఘాల నాయ‌కులంద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు శుక్ర‌వారం వెళ్లి క‌లిశారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మీద పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. కానీ, ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ(suryanarayana) మాత్రం వ్య‌తిరేకంగా ఉన్నారు. అందుకే ఆయ‌న్ను టార్గెట్ చేస్తూ ప్ర‌భుత్వం వెంటాడుతోంది.

Also Read : AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

సీపీఎస్ ర‌ద్దు కోరుతూ రెండేళ్ల క్రితం చేసిన ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు ప‌లువురి మీద ఏపీ పోలీసులు కేసులు పెట్టారు. కొంద‌రు కోర్టుల చుట్టూ తిరుగుతుండ‌గా, మ‌రికొంద‌రు పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఆ జాబితాలో సూర్య‌నారాయ‌ణ ప్ర‌ధానంగా ఉన్నారు. అంతేకాదు, ఆయ‌న మీద మిగిలిన సంఘాల నేత‌లు కూడా వ్య‌తిరేకంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వానికి (Jagan Governament)వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని అప‌వాదు మోపారు. పైగా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఉద్యోగుల‌ను ఉద్య‌మం వైపు మ‌ళ్లిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఆయ‌న‌కు కొంద‌రు ఉద్యోగ సంఘం నేత‌లు మ‌ద్ధ‌తు ఇస్తుండ‌గా, మెజార్టీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు అండ‌గా నిలుస్తున్నారు. ఇలా, రెండు గ్రూపుల‌కుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌ను విడ‌దీసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆడుకుంటోన్న తీరు భిన్నాభిప్రాయాల‌కు దారితీస్తోంది.

Also Read : AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక‌, సూర్య‌నారాయ‌ణపై పోలీస్ వేట‌