CM Jagan: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వరాలజల్లు కురిపిస్తున్న జగన్ తాజాగా అర్చకుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, విజయదశమి సందర్భంగా రాష్ట్రంలోని అర్చకులకు శుభవార్త వినిపించారు సీఎం జగన్.. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెవరేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అర్చకుల కనీస వేతనం రూ.15,625లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ కమిషనర్. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,177 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది.. మరోవైపు.. ఈ రోజు బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.
Also Read: State Bird: కనిపించకుండాపోతున్న పాలపిట్టలు.. దసరాకు దర్శనం లేనట్టేనా!